సొంత చెల్లిని వ్యబిచారంలోకి దింపిన అక్క.. బాలికపై కన్నేసి! | Forced Into Prostitution By Sister, Minor Killed In Jharkhand | Sakshi
Sakshi News home page

సొంత చెల్లిని వ్యబిచారంలోకి దింపిన అక్క.. ఒప్పుకోలేదని!

Published Mon, Oct 25 2021 3:07 PM | Last Updated on Tue, Oct 26 2021 11:34 AM

Forced Into Prostitution By Sister, Minor Killed In Jharkhand - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రాంచీ: ఏడు నెలల క్రితం కనిపించకుండా పోయిన 17 ఏళ్ల అమ్మాయి విగతజీవిగా కనిపించింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని సోనార్‌ డ్యాం వద్ద ఝార్ఖండ్‌ పోలీసులు కోర్టు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కాగా బాలికను తోడబుట్టిన వారే కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.. మైనర్‌ను ఆమె  అక్కలు రాఖీ దేవి(30), రూపా దేవి(25), బావ ధనుంజయ్‌ అగర్వాల్‌(30), రాఖీ లవర్స్‌ ప్రతాప్‌ కుమార్‌, నితిష్‌లు కలిసి హత్య చేసినట్లు తెలిపారు. నిందితుల్లో నితిష్‌ తప్ప మిగతా అందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాంచిలోని రిమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 
చదవండి: జిమ్‌ ట్రైనర్‌ ప్రేమ విఫలం.. పెళ్లి చూపులకు వెళ్లాల్సి ఉండగా..

పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. బాలిక తలకు గాయాలు ఉన్నాయని తేలింది. అయితే మృతురాలి సోదరీలు మాత్రం బాలిక ఆత్మహత్య చేసుకొని మరణించినట్లు చెబుతున్నారు. పోలీసు అధికారి విజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు అక్కాచెల్లెల్లో ఈ బాలిక నాలుగో అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో అక్క రాఖీతో కలిసి ఉంటుంది. తన అక్క రాఖీ వ్యభిచారం నిర్వహిస్తుంది.
చదవండి: ఎన్నో అనుమానాలు.. ‘మొహంపై గీతలు, రక్తం, కన్ను గుడ్డు లేదు’

రాఖీ, ధనంజయ్‌లు మైనర్‌ను బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. వారు ఆమె ఇష్టానికి విరుద్ధంగా కస్టమర్‌ల వద్దకు పంపేవారు. అయితే బాలిక ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పగా వారు వ్యతిరేకించారు. ప్రతాప్, నితేష్ ఇద్దరూ బాలికపై క‌న్నేసి రాఖీ సాయంతో ఆమెపై ప‌లుమార్లు లైంగిక దాడికి య‌త్నించారు.

ఈ క్ర‌మంలో రాఖీ ఇంట్లో లేని స‌మ‌యంలో హ‌త్య‌కు రెండ్రోజులు ముందు ఆమె ఇంటికి వ‌చ్చిన ప్ర‌తాప్ ప్లాన్‌ ప్రకారం బాధితురాలిపై అత్యాచారానికి పాల్ప‌డి ఆమెను హ‌త్య చేసి ఆమె శరీరాన్ని ఉరితీశాడు. అనంతరం ఈ విష‌యం  రాఖీ, రూప, ధ‌నంజ‌య్‌ల‌కు తెలుప‌గా అంద‌రూ క‌లిసి మృత‌దేహాన్ని ఆటోలో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి పాతిపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement