ఆ బంక్లో డీజిల్ పోయించుకుంటే..అంతే | customers protesting on duplicate diesel | Sakshi
Sakshi News home page

ఆ బంక్లో డీజిల్ పోయించుకుంటే..అంతే

Published Fri, Oct 23 2015 8:18 PM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

ఆ బంక్లో డీజిల్ పోయించుకుంటే..అంతే - Sakshi

ఆ బంక్లో డీజిల్ పోయించుకుంటే..అంతే

తగరపువలస: విశాఖపట్టణం పెద్దిపాలెంలో అది ఓ పేరుమోసిన పెట్రోల్ బంక్. ఏమి జరిగిందో తెలియదు కానీ, ఈ మధ్య ఆ బంక్లో పెట్రోల్ పోయించుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనతో ఆ బంక్లో డీజిల్ కల్తీ అవుతున్న విషయం బహిర్గతమైంది.

నగరానికి చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో ఈ బంక్లో డీజిల్ నింపుకొని బయలుదేరిన పది కిలోమీటర్లకే వాహనం మొరాయించింది. దీంతో మెకానిక్‌కు చూపించగా.. కల్తీ డిజిల్ వల్ల వాహనం ఇంజన్ దెబ్బతిన్నదని చెప్పాడు. బాధితుడు బంక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగాడు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వినియోగదారులకు బంక్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంత జరుగుతున్న అధికారులు ఆ బంక్ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనర్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement