'హెలీ టూరిజం' నిరసనకారుల అరెస్టు | Goa Congress leader protesting heli-tourism arrested | Sakshi
Sakshi News home page

'హెలీ టూరిజం' నిరసనకారుల అరెస్టు

Published Wed, Feb 3 2016 6:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Goa Congress leader protesting heli-tourism arrested

పనాజీ: హెలీ టూరిజంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. పవన్ హాన్స్ సంస్థతో కలిసి గోవా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, పనాజీ నుంచి అగ్వాడాకు మంగళవారం హెలీకాప్టర్ రైడ్స్ను ప్రారంభించింది.

అయితే ఈ హెలీ టూరిజం వల్ల స్థానికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని గోవా కాంగ్రెస్ నాయకుడు అజ్నెల్ ఫెర్నాండేజ్, మరో పదిమంది స్థానిక పంచాయతీ నాయకులు మండిపడ్డారు. రాస్తారోకో నిర్వహించి హెలీపాడ్ వైపుగా వస్తున్న వారిని గోవా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement