వరుడైన శ్రీనివాసుడు
వరుడైన శ్రీనివాసుడు
Published Wed, Oct 12 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 5:00 PM
ద్వారకాతిరువుల : సర్వాభరణ భూషితుడైన శ్రీవారు నుదుటున కల్యాణతిలకం, బుగ్గనచుక్కతో పెండ్లి కువూరునిగా శోబిల్లారు. అలాగే పద్మావతి, ఆండాళ్ అవ్మువార్లు పెండ్లికువూర్తెలుగ ముస్తాబయ్యారు. శ్రీవారిని, అవ్మువార్లను పెండ్లికువూరుడు, పెండ్లికువూర్తెను చేÄýæుు వేడుకను చూసిన భక్తజనులు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరువులలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభ వుయ్యాయి. తొలిరోజున స్వామివారు, అవ్మువార్లు పెండ్లి కువూరునిగాను, పెండ్లికువూర్తెలుగాను అలంకార భూషితులయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, వేద వుంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నావుస్మరణల నడువు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత ఆలయ ప్రదక్షిణ వుండపంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేసి సుగంధభరిత పుష్పవూలికలు, వూమిడితోరణలు, అరటి బోదెలుతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే ఆలయ పరిసరాలను విశేష అలంకారాలతో తీర్చిదిద్దారు. వేదికపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై శ్రీవారు, అవ్మువార్ల ఉత్సవ వుూర్తులను వేంచేపుచేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజాధికాలు జరిపారు. ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఈవేడుకను అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు దంపతులు, రాష్ట్ర దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ పీవీ.రమణరాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. .
రాజాదిరాజ వాహనంపై ఊరేగిన శ్రీవారు
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మెుదటిరోజున జరిగే రాజాదిరాజ వాహన సేవకు ఎంతో ప్రావుుఖ్యత ఉంది. ఈ వాహనంలో కొలువైన గరుత్మంతుడు స్వామి, అమ్మవార్లను మోస్తున్నట్లు ఉన్న అలంకరణ భక్తులకు నేత్రపర్వమైంది. శ్రీవారి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను మంగళవారం రాత్రి క్షేత్రపురవీదుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గజసేవనడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పువీదులకు పయనమైన స్వామివారిని అడుగడుగునా భక్తులు దర్శించి, నీరాజనాలను సమర్పించారు. శ్రీ హరికళాతోరణంలో జరపిని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Advertisement