srinivasa
-
చంద్రబాబు బీసీలను బానిసలుగా చూసేవాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ
-
నేడు శ్రీనివాస సేతు ప్రారంభం
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమ, మంగళవారాల్లో తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలోని నాలుగు దిక్కులను కలుపుతూ యాత్రికులు నేరుగా తిరుమల వెళ్లేందుకు అత్యాధునిక రీతిలో నిర్మిం చిన శ్రీనివాస సేతు (ఫ్లైఓవర్) ప్రారంబోత్సవం, ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్ ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ (తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద 307 ఎకరాల్లో 3,518 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు) కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత తిరుమల చేరుకుని వకుళమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌లు ప్రారంభిస్తారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని శ్రీవారికి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని, రాత్రికి పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. నీటి పథకాలకు ప్రారంబో త్సవం మంగళవారం ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడి నుంచి కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకుంటారు. అక్కడ డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు తాగు, సాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన 68 చెరువులను కృష్ణా జలాలతో నింపే పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నంద్యాల జిల్లా డోన్‌కు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
శ్రీనివాస సేతు ప్రమాదం బాధాకరం: ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి: ఫ్లైఓవర్ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణార్ రెడ్డి. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదంపై స్పందించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మూడు సెగ్మెంట్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు..భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం. మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగింది. 700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వము నుంచి సహకారం అందించి ఆదుకుంటాం అని ఎమ్మెల్యే భూమన తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదం భారీ క్రేన్ సిమెంట్ సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తున్న సమయంలో కేబుల్స్ తెగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ సెగ్మెంట్ కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 70-80 టన్నుల బరువున్న సిమెంట్ సెగ్మెంట్ పడడంతో బాడీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతులు బీహార్ రాష్ట్రం కథియార్ జిల్లాకు చెందిన బార్థో మండల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్ ఘోష్‌గా గుర్తించారు. భారీ క్రేన్ సహాయంతో సిమెంట్ సెగ్మెంట్ ను తొలగించి.. డెడ్ బాడీ లను రుయా ఆసుపత్రికి తరలించారు. -
ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?
పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ఏపీ పునర్విభజన చట్టం–2014’లోని అంశాలు పరిష్కరించకుండా కేంద్రం సాచివేత ధోరణి ప్రదర్శిస్తున్నది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు గడిచినా విభజన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా, ఉపయోగం లేకుండా పోయింది. పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లతో పాటు 91 సంస్థ లను, అదేవిధంగా షెడ్యూల్ 10లోని ఏపీ స్టేట్‌ఫైనాన్స్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్‌తో పాటు 142 సంస్థల్లోని ఆస్తులు, ఇతర లావాదేవీలను 48:52 ప్రకారం విభజించాల్సి ఉన్నది. కానీ కేంద్రం దేన్నీ తేల్చకుండా దాటవేత ధోరణి అవలంభిస్తున్నది. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో షీలా భిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై భిడే కమిటీ చేసిన సిఫార్సులను రెండు రాష్ట్రాలూ అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89 శాతం ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్ర్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవా లని ఏపీ అడుగుతోంది. ఇదీగాక తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్‌యూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల విభజన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. విద్యుత్ రంగ సమస్యల పరిష్కారానికి నీరజా మాథుర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇప్పటికీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి వాటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్ డెవలప్మెంట్, టీఎస్ ఎంఎస్ఐడీసీ, మినరల్ డెవలప్మెంట్ సంస్థ వంటి ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.2 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. 2014 నుండి, చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో మొత్తం 29 సమీక్షా సమావేశాలను నిర్వహించింది. అయినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇరు రాష్ట్రాలు పరస్పరం ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. గోదావరి, కృష్ణా నదీజలాల వాటాల పంపిణీలోనూ కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నది. దేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తి నప్పుడు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్, 262 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. 575 టీఎంసీల నీటి వాటా కోసం కృష్ణా నదీ జలాల పంపకం అంశాన్ని ట్రిబ్యునల్‌కు పంపాలని తెలంగాణ కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఆ అభ్యర్థన లన్నిటినీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తు న్నది. తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కాగా ఎగువన ఉన్న కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా మంజూరు చేసింది. అలాగే ఏపీలోని పోలవరానికీ జాతీయ హోదా ఇచ్చింది. కానీ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది. ఉన్న చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నవోదయ పాఠశా లలు ఇవ్వకపోగా తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది. ‘ఆస్తుల విభజన చేపట్టకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. తగు మాత్రంలో నిధులు అందకపోవడం, విభజన చట్టం ప్రకారం ఆస్తుల విభజన చేపట్టకపోవడంతో... ఆంధ్రాలోని ప్రభుత్వ సంస్థలు తీవ్రంగా ప్రభావిత మవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న 1,59,096 మంది ఉద్యోగుల పరిస్థితి విభజన జరిగిన 2014 నుంచి డోలాయమానంలో ఉంది. సరిగా విభజన జరగకపోవడమే దీనికి ఏకైక కారణం. విభజన తర్వాత రిటైరైన ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పదవీ విరమణ సమయంలో వారికి దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆస్తులు విభజించి ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలి’ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు కేంద్ర ప్రభుత్వానికీ, తెలంగాణకూ నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. సహజంగా ఏ రాష్ట్రమైనా తనకు లాభం జరగాలనే చూస్తుంది. అయితే విభజన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కావాలనే సమస్యను నాన్చుతున్నది. మొత్తంగా రెండు రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధించడంలో కేంద్రం విఫలం కావడం వల్లే, సమస్య కోర్టు వరకూ వెళ్లింది. ఇప్పటికైనా హక్కుగా ఏ రాష్ట్రానికి ఏం దక్కుతుంతో తేల్చి చట్టప్రకారం సంస్థలు, ఆస్తుల విభజన చేపట్టాలి. బచ్చు శ్రీనివాస్ వ్యాసకర్త బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మొబైల్: 93483 11117 -
యూకే, యూరోప్ లలో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవాలు..
-
భక్తులకు దర్శనమిచ్చిన ఉగ్ర శ్రీనివాసుడు
-
తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపు.. ఇవి గమనించండి!
సాక్షి, తిరుపతి: నగరంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిపై శ్రీనివాస సేతు ప్రాజెక్టు పనుల నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ వైపునకు వచ్చే వాహనాలు, వెళ్లే వాహనాలను తాత్కాలికంగా మళ్లిస్తున్నామన్నారు. ఈ మార్పు శుక్రవారం నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. బెంగళూరు, చిత్తూరు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు రామానుజపల్లి చెక్‌పోస్ట్ వద్ద నుంచి శ్రీపద్మావతి మహిళా యునివర్సిటీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండుకు చేరుకోవచ్చు. చంద్రగిరి టౌన్, చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు . మదనపల్లి, పీలేరు, రాయచోటి, అనంతపురం నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు చెర్లోపల్లి సర్కిల్, బాలాజి కాలనీ, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. చెర్లోపల్లి, జూపార్క్, అలిపిరి, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవచ్చు. లైట్ మోటార్ వాహనాలు: బస్టాండ్ నుంచి రేణిగుంటకు.. రామానుజం సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్ వైపు వెళ్లాలంటే డీబీఆర్ హాస్పిటల్ మీదుగా హీరో హోండా షోరూమ్ వద్ద రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటుకొని వెళ్లవచ్చు. ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉన్నట్లు గుర్తించగలరు. పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులు: రేణిగుంట మీదుగా నారాయణాద్రి హాస్పిటల్, తిరుచానూర్ ఫ్లై ఓవర్, ఆర్సీపురం జంక్షన్, ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్, అన్నమయ్య సర్కిల్, వెస్ట్ చర్చ్, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటాయి. హైదరాబాద్, కర్నూల్, కడప వాహనాలు కరకంబాడి మీదుగా బస్టాండు చేసుకోవచ్చు. నెల్లూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు, చెన్నై నుంచి వచ్చే వాహనాలు రేణిగుంట రమణవిలాస్ సర్కిల్ మీదుగా కరకంబాడి, మంగళం లీలామహల్ మీదుగా వెళ్లచ్చు. లేకుంటే, గాజులమండ్యం జంక్షన్, ఆర్సీ పురం జంక్షన్, రామానుజపల్లి చెక్ పోస్ట్, మహిళా యునివర్సిటీ, బాలాజి కాలనీ, నంది సర్కిల్, శ్రీనివాస సేతు మీదుగా బస్టాండ్ చేరుకోవచ్చు. అత్యవసర వాహనాలు ట్రాఫిక్ మళ్లింపు కారణంగా అంబులెన్స్, మెడికల్, ప్రభుత్వ వాహనాలకు, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలి. అలాగే ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలు, విద్యాసంస్థలు తమ విద్యార్థుల రవాణా సౌకర్యార్థం అనువైన మార్గాన్ని ఎంచుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తిరుపతి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. (క్లిక్: హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి) -
శ్రీనివాస సేతుపై స్మార్ట్ జర్నీ! వాహనాలకు అనుమతి
-
ఆధ్యాత్మిక గిరిలో శ్రీనివాస సేతు వెలుగులు!
-
చూశారు.. విన్నారు
సమీక్ష సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ మాట్లాడుతూ ప్రస్తుతం అభ్యర్థులను గుర్తించేందుకు తాము రాలేదని కార్యకర్తలకు తెలిపారు. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలో గ్రూపులు ఉండొద్దని హెచ్చరించారు. టీఆర్ఎస్ మెనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలుచేయడం లేదని, దానిపై తాలుకా, మండల, గ్రామస్థాయిలో ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని సూచించారు. అదే సమయంలో ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుందన్నారు. మళ్లీ నియోజకవర్గాలకే వచ్చి అభ్యర్థులను గుర్తిస్తామన్నారు. సీనియర్ నాయకులు విభేదాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడాలని, పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అదే సమయంలో టికెట్ల పంపిణీలో కార్యకర్తల అభిష్టానికే ప్రాధాన్యత ఉంటుందని, నేతల సిఫార్సులను పట్టించుకునేది లేదని పేర్కొన్నారు. సాక్షి,ఆదిలాబాద్: టికెట్ ఆశావహులు బలప్రదర్శనతో వచ్చారు.. నియోజకవర్గంలో తమకున్న పట్టును పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లాలని చూశారు.. నేత వెంట వచ్చిన కార్యకర్తల్లోనూ మంచి జోష్.. నాయకుడికి జిందాబాద్ కొట్టాలన్న ఉత్సాహం.. ఇంకేముంది సమావేశంలో నినాదాలే మార్మోగుతాయని అంతా భావించారు. అయితే పరిశీలకులు మాత్రం మెలిక పెట్టారు. నియోజకవర్గ సమీక్షలో అభ్యర్థి ప్రస్తావన చేయద్దన్నారు. అలా చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే చర్చించాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నియోజకవర్గ సమీక్ష సమావేశం తీరుతెన్నే మారిపోయింది. కార్యకర్తలు నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. మరోవైపు టికెట్ ఆశవాహులు తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను పరిశీలకుని దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో ఇది కొత్తకోణం. వర్గపోరు, గ్రూపు విభేదాలను ముందే ఊహించిన పరిశీలకులు అభ్యర్థి ప్రస్తావన లేకుండా పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి అంటూ అటు నియోకవర్గ పరిస్థితిని చూశారు.. కార్యకర్తలు, నేతల సమస్యలు, అభిప్రాయాలను విన్నారు. పరిశీలకులకు ఘన స్వాగతం.. ఏఐసీసీ కార్యదర్శి, ఆదిలాబాద్, పెద్దపెల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాసన్ కృష్ణన్ బుధవారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆయనతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రేమ్ లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వచ్చారు. ఆదిలాబాద్ శివారులో కాంగ్రెస్ నేతలు పరిశీలకులకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ నిర్వహించి సమీక్ష సమావేశం నిర్వహించే పంచవటి హోటల్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకున్నారు. గందరగోళం.. జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశమని పేర్కొనడంతో సుమారు 150 మంది వరకు రావచ్చని పార్టీ వర్గాలు అంచనా వేశారు. అయితే ముఖ్యనేతలు పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలిరావడంతో సమావేశం గది పూర్తిగా నిండిపోయింది. మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. మొత్తం వారితోనే గది నిండిపోగా, పరిశీలకులతో పాటు మిగతా నియోజకవర్గ నాయకులు అక్కడికి చేరుకునే సరికి గందరగోళ పరిస్థితులు కనిపించాయి. పలువురికి కుర్చీలు కూడా లేకపోవడంతో నిల్చొని ఉన్నారు. మరోపక్క తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తుండడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. టికెట్ ఆశావహులు బలప్రదర్శన చేయాలనే ప్రయత్నాలు కనిపించాయి. ఈ క్రమంలో పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్ జోక్యం చేసుకొని నియోజకవర్గం వారీగా విడివిడిగా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. దీంతో నియోజకవర్గ కార్యకర్తలు మినహా ఇతర నియోజకవర్గ కార్యకర్తలు బయటకు వెళ్లిపోవడంతో సమీక్ష ప్రారంభించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు.. కాంగ్రెస్ పార్టీ నియోకవర్గాల సమీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి వరకు కొనసాగింది. వేదికపై పరిశీలకులు శ్రీనివాసన్ కృష్ణన్, మహేశ్‌కుమార్‌గౌడ్, ప్రేమ్‌లత అగర్వాల్, నమిల్ల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు నరేష్‌జాదవ్ కూర్చున్నారు. మొదట సిర్పూర్కాగజ్నగర్ నుంచి సమీక్ష ప్రారంభించారు. ఆతర్వాత చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ముథోల్, ఖానాపూర్, నిర్మల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. ∙ సిర్పూర్కాగజ్నగర్ నుంచి గోసుల శ్రీనివాస్‌యాదవ్, రావి శ్రీనివాస్, సిడాం గణపతి పాల్గొన్నారు. కొంతమంది కార్యకర్తలు నియోజకవర్గానికి ఇన్చార్జీలను ప్రకటించాలని పరిశీలకులను కోరారు. ∙ చెన్నూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బోడ జనార్దన్, దుర్గం అశోక్, బెల్లంపల్లి నుంచి చిలుమూరి శంకర్, దుర్గాభవానితో పాటు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గాల సమీక్ష సుమారు అరగంట నుంచి 45 నిమిషాల పాటు సాగింది. ∙ మంచిర్యాల నియోజకవర్గం సమీక్ష సమావేశం గంటకు పైగా కొనసాగింది. ఇందులో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ముఖ్యనేతలు తాము నియోజకవర్గంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలపై ప్రస్తావించారు. ∙ ఆసిఫాబాద్ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ముథోల్ సమీక్షలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పాల్గొనగా, మరో ముఖ్యనేత రామారావుపటేల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. ∙ ఖానాపూర్ నుంచి హరినాయక్, భరత్‌చౌహాన్, నిర్మల్ నుంచి మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సి.రాంచంద్రారెడ్డి, గండ్రత్ సుజాత, భార్గవ్‌దేశ్‌పాండేలు పాల్గొన్నారు. ∙ రాత్రి వరకు ఈ సమీక్ష కొనసాగింది. మధ్యాహ్నం నుంచి ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. సోయం బాపూరావు గైర్హాజరు.. ఆదివాసీకే టికెట్ ఇవ్వాలి బోథ్ నియోజకవర్గం నుంచి నరేష్‌జాదవ్, అనిల్‌జాదవ్ పాల్గొనగా సోయంబాపూరావు గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపూరావు బోథ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, లేనిపక్షంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తారా అనే మీమాంస పార్టీలో ఉండగా, సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా సమీక్ష సమావేశానికి గైర్హాజరు వెనుక ఏదైనా అసంతృప్తి ఉందా అన్న చర్చ సాగుతోంది. స్థానికంగానే ఉన్నప్పటికీ ఆయన ఈ సమావేశానికి రాలేదు. అయితే వేదికపై లంబాడా నాయకులు ఉండడంతోనే ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు కొంతమంది కార్యకర్తలతో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బోథ్ సమీక్ష సమావేశంలో కొంతమంది కార్యకర్తలు బోథ్ నియోజకవర్గం నుంచి ఆదివాసీకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి కూడా ఆదివాసీకే అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. -
చరిత్రలో ఒక ఉదారవాది
స్వాతంత్య్రోద్యమ చరిత్ర పేరుతో మన పాఠ్య పుస్తకాలలో కనిపించేది భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర మాత్రమే. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర (1857) మినహాయిస్తే మిగిలిన చరిత్రంతా భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రే. జాతీయ కాంగ్రెస్‌తో పాటు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సంస్థలు ఉన్నా, వాటి చరిత్రకు తగిన స్థానం కల్పించలేదు. అదే జరిగి ఉంటే జాతీయ కాంగ్రెస్ కంటే ముందే ఆరంభమైన గిరిజన పోరాటాలు, జాతీయ కాంగ్రెస్ పోరాటంతో సమాంతరంగా మైదానాలలో జరిగిన రైతాంగ పోరాటాలు, తీవ్ర జాతీయవాదంతో విదేశీ గడ్డ మీద నుంచి ఉద్యమించిన గదర్, హెచ్ఆర్ఏ వంటి సంస్థల త్యాగాలు, ఆఖరికి పూర్తి రాజ్యాంగ పంథాలో ఉద్యమానికి అంకితమైన లిబరల్ పార్టీ గురించి కూడా గొప్ప వివరాలు తెలియవు. కాబట్టే స్వరాజ్య సమరంలో ఎంతటì త్యాగాలు చేసినా, వారు ఎంతటి మహానుభావులైనా కొందరి పేర్లు చరిత్ర పుస్తకాలలో కానరావు. నిజానికి ఆ సంస్థలో సర్వం త్యాగం చేసిన వారి చరిత్రకు కూడా చరిత్ర గ్రంథాలలో తగిన స్థానం కనిపించదు. ఇక గాంధీజీ సిద్ధాంతాలతో ఏదో ఒక దశలో విభేదించి తమదైన మార్గంలో పోరాటాలు చేసిన వారి పేర్లు కూడా కనుమరుగు కావడం మరొక విశేషం. అలాంటివారిలో ఒకరు వీఎస్ శ్రీనివాసశాస్త్రి. వాళంగైమన్ శంకరనారాయణ శ్రీనివాసశాస్త్రి (సెప్టెంబర్ 22,1869–ఏప్రిల్ 17, 1946) రాజకీయ జీవితం, ఉద్యమం, జాతీయోద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర నిర్మాణాత్మకమైనవి. శ్రీనివాసశాస్త్రి గోపాలకృష్ణ గోఖలే శిష్యుడు. గోఖలే శిష్యులుగా ఖ్యాతి గాంచిన తేజ్ బహదూర్ సప్రూ, జిన్నాల వలెనే శాస్త్రి కూడా కానిస్టిట్యూషనలిస్ట్. ఉద్యమం, హక్కుల సాధన రాజ్యాంగ బద్ధంగా మాత్రమే జరగాలన్నది వీరి ఆశయం. గోఖలేను గురువుగా భావించిన గాంధీజీ శాస్త్రిని ప్రియ సోదరుడా అని సంబోధించేవారు. శ్రీనివాసశాస్త్రి తంజావూరు జిల్లాలోని వాళంగైమన్ అనే గ్రామంలో పుట్టారు. తండ్రి పూజారి. కాబట్టి ఎంత శోత్రియ కుటుంబమో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ ఆంగ్ల భాషలో ఆయన కీర్తి అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడమే విశేషం. తరువాత వారి కుటుంబం కుంభకోణం తరలివచ్చింది. అక్కడే ఆయన విద్యంతా సాగింది. ప్రతి తరగతిలోను ప్రథమ స్థానంలో నిలుస్తూ, ఉన్నత విద్య వరకు ఉచితంగా ఆయన విద్యాభ్యాసం చేశారు. కుంభకోణంలోనే బీఏ చదువుతూ ఉండగా ఇంగ్లిష్ పరీక్ష రాయడానికి శాస్త్రి మద్రాస్ నగరానికి (1887) వచ్చారు. అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడే శ్రీనివాసశాస్త్రి సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యాసం విన్నారు. అప్పటికే ఇంగ్లిష్ ప్రొఫెసర్ అయిన బెనర్జీ ఉపన్యాసం, అందులో ధార, ధారణ శాస్త్రిని వివశుడిని చేశాయి. బెనర్జీకి భక్తునిగా మారిపోయారాయన. తరువాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి, అంచెలంచెలుగా మద్రాస్ ట్రిప్లికేన్‌లోని హిందూ ఉన్నత పాuý శాల ప్రధానోపాధ్యాయుడయ్యారు. గురుశిష్య సంబంధాన్ని ఆయన మలచి తీరు ఒక నమూనాగా మారిపోయింది. ఉపాధ్యాయ సంఘాన్ని కూడా ఆయన స్థాపించి, వారి డిమాండ్లకు గొంతునిచ్చారు. ఎక్కడా సహకార వ్యవస్థ ఆవిర్భవించని కాలంలో సహకార వ్యవస్థను కూడా ఆయన తన సంఘంలో పరిచయం చేశారు. విద్యార్థులతో బయట ఎంత ఉదారంగా వ్యవహరించేవారో, తరగతిలో అంత కఠోర క్రమశిక్షణ అమలు జరిపేవారు. శాస్త్రి ఖ్యాతి దేశవ్యాప్తమైందంటే అతిశయోక్తికాదు. ఆంగ్లంలో సిల్వర్ టంగ్డ్ ఆరేటర్ అన్న పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే ఆయన హఠాత్తుగా ఉద్యోగానికి స్వస్తి పలికారు. జీఏ నటేశన్ అనే మిత్రుడు ‘కాన్షిడెన్షియల్’ అనే శీర్షికతో ఉన్న ఒక చిన్న కరపత్రాన్ని శాస్త్రికి అందచేశారు. అది గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో నడుస్తున్న సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆశయాలను, సిద్ధాంతాన్ని, నియమాలను వివరించే కరపత్రం. అందులో ఆయనను బాగా ఆకట్టుకున్న అంశం– ప్రజా జీవితాన్ని ఆ«ధ్యాత్మికం చేయాలన్న ఆశయం. ఆ క్షణంలోనే ఆయన మనసు మారిపోయింది. గోఖలేకు వెంటనే ఒక లేఖ రాశారు. తన వయసు 37 ఏళ్లు అని, మిగిలిన జీవితంలో దేశం కోసం కేటాయించడానికి ఎంత మిగిలిఉందో తన కు తెలియదనీ, కాబట్టి వెంటనే తాను సేవారంగంలో ప్రవేశించదలుచుకున్నానని దాని సారాంశం. గోఖలే కూడా సంతోషంగా స్వాగతం పలికారు. గోఖలే నుంచి లేఖ రావడంతోనే ప్రధానోపా«ధ్యాయ పదవికి ఆయన రాజీనామా ఇచ్చేశారు. పిల్లలకు వీడ్కోలు చెబుతూ, రాముడికి కౌసల్య చెప్పిన ధార్మిక విషయాలను ప్రస్తావించారు. ఇక్కడ ఒక విషయం విస్మరించడానికి వీలు లేదు. శాస్త్రి చిన్నతనం నుంచి కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్న పేదరికం ఆయన ఉద్యోగం వదిలేసి, నిస్వార్థదృష్టితో సేవా రంగంలోకి దిగిన క్షణం వరకు వెన్నంటే ఉంది. స్వాతంత్య్ర సమరంలో కనిపించే అత్యంత అరుదైన మేధావి వర్గంలో ఒకరాయన. ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన రాజనీతి తత్వవేత్తల ప్రభావం ఆయన మీద కనిపిస్తుంది. ఎడ్మండ్ బర్క్, హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టూవర్ట్ మిల్, మార్కస్ అరులియస్ రచనల ప్రభావం ఆయన మీద ఉంది. షేక్సిపియర్, వాల్టర్ స్కాట్, జార్జ్ ఇలియెట్, టీహెచ్ హక్సలీ, టాల్‌స్టాయ్, థామస్ హార్డీ, విక్టర్ హ్యూగో వంటి మహోన్నత సాహితీమూర్తుల రచనలన్నీ ఆయన చదివారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, రామాయణ కావ్యం మీద ఆయనకున్న పరిజ్ఞానం మరొక ఎత్తు. ఆ కావ్యం మీద ఆయన పలు రచనలు చేయడమే కాకుండా, ఉపన్యాసాలు కూడా ఇచ్చారు. గోఖలే అనుచరులలో ఎవరికీ దక్కని గౌరవం శాస్త్రికి దక్కింది. గోఖలే మరణం (1915) తరువాత సర్వేంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ అధ్యక్ష పదవి శాస్త్రిని వరించింది. రాజకీయ గురువు గోఖలేను అనుసరించి శాస్త్రి భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయాలలోకి అడుగు పెట్టారు. 1907లో అది జరిగింది. నిజానికి ఆ సంవత్సరంలో సూరత్‌లో జరిగిన వార్షిక సమావేశాలు ఆ మహా సంస్థ చరిత్రలో మాయని మచ్చ వంటివి. అతివాదులు, మితవాదులు పేరుతో కాంగ్రెస్ చీలిపోయింది. గోఖలే, ఫిరోజ్‌షా మెహతాల అనుచరులు లోకమాన్య తిలక్‌ను వేదిక నుంచి బలవంతంగా దించివేయడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలోనే సభలో ఉన్న ఎవరో ఫిరోజ్‌షా లక్ష్యం విసిరారు. అది చూసిన శాస్త్రి వేదిక మీదకు పరుగున వెళ్లి ఫిరోజ్‌షాకు అడ్డంగా నిలవాలని అనుకున్నారు. ఆ బూటు వచ్చి సురేంద్రనాథ్ బెనర్జీని తాకి, ఫిరోజ్‌షా మీద పడింది. ఆ తరువాత సంవత్సరం మద్రాస్‌లో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల నాటికే శాస్త్రి కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. సప్రూ, జిన్నాలతో పాటు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువస్తున్న రాజ్యాంగ సంస్కరణలను సమీపంగా పరిశీలించిన వారిలో శాస్త్రి కూడా ప్రముఖులు. 1919 నాటి మాంటేగ్–చెమ్స్‌ఫర్డ్ చట్టం రూపకల్పనలో శాస్త్రి తన వంతు సాయం అందించారు. బాధ్యతాయుత ప్రభుత్వం అందించడానికి ప్రభుత్వం సరేనని చెప్పడమే శాస్త్రి తదతర మేధావులను తృప్తి పరిచింది. అయితే దీనిని కాంగ్రెస్‌లో ఒక వర్గం, గాంధీజీ ఆమోదించలేదు. ఆపై సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. దీనితో శాస్త్రి కాంగ్రెస్‌కు దూరంగా జరిగారు. ఈ పరిణామంతోనే కాంగ్రెస్‌కు దూరమై, దేశ చరిత్రలో పెద్ద మలుపునకు బీజం వేసినవారు జిన్నా. అప్పుడు జరిగిన మరో పరిణామం– నేషనల్ లిబరల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆవిర్భావం. కాంగ్రెస్‌లోని అతి,మితవాద వర్గాలు దేనికీ చెందకుండా, అనిబిసెంట్ నాయకత్వంలోని హోంరూల్ లీగ్‌కు సమీపంగా జరిగి, బ్రిటిష్ పాలకులకు ఆగ్రహం రాని విధంగా వ్యవహరించిన కానిస్టిట్యూషనలిస్టుల వేదికే ఈ ఫెడరేషన్. ఇందులో సప్రూ, జిన్నా, శాస్త్రి ప్రముఖులు. కానీ జిన్నా ద్విజాతి సిద్ధాంతాన్ని శాస్త్రి అంగీకరించలేదు. దేశ విభజనను కూడా. దేశంలోని ఉదారవాదుల ప్రతిని«ధిగా రెండు రౌండ్ టేబుల్ సమావేశాలలో (1930–31) ఆయన పాల్గొన్నారు. అక్కడ శాస్త్రి ఉపన్యాసం విన్న తరువాత ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ లాయిడ్ జార్జి ఇక తనకు ఇంగ్లిష్ మాట్లాడాలంటే సంకోచంగా ఉందని అన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన కొన్ని విశ్వవిద్యాలయాలు, పత్రికలు కూడా శాస్త్రి ఉచ్చారణను ప్రామాణికంగా తీసుకున్నాయి. తన గ్రంథం ‘మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్’ ఆంగ్ల చిత్తుప్రతిలో భాషను సరిచూసే పనిని గాంధీజీ శాస్త్రిగారికే అప్పగించారు. 1913లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆయనను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ సంగతి ఎలా ఉన్నా 1918 నాటికి ఆయన ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా రౌలట్ బిల్లును వ్యతిరేకించారు. అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల తనకున్న సానుకూలతను ఆయన నిస్సంశయంగా వదిలిపెట్టారు. గాంధీజీకి కూడా రౌలట్ బిల్లు, దీని పర్యవసానం జలియన్‌వాలా బాగ్తోనే ఆంగ్లేయుల రాజనీతిజ్ఞత మీద సందేహాలు మొదలైనాయి. జిన్నా కూడా ఆ బిల్లును తీవ్రంగా విమర్శించి కౌన్సిల్‌కు రాజీనామా కూడా ఇచ్చారు. శాస్త్రి నాడు జరిపిన విదేశీ పర్యటనలు, వాటి ప్రాధాన్యం మరో ముఖ్యమైన అంశం. 1922లో వాషింగ్టన్లో జరిగిన నావికా ఆయుధ సంపత్తి పరిమితి మీద ఏర్పాటైన సదస్సుకు శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం ప్రతినిధిగా పంపించింది. ఆ తరువాత సంవత్సరం ఇంగ్లండ్‌లో పర్యటించి కెన్యాలోని భారతీయులకు సమాన హక్కులు ఇవ్వాలని ప్రచారం చేశారు. మలేసియాలోని భారతీయ కార్మికుల బాగోగుల గురించి దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో కూడా శాస్త్రిని ఆంగ్ల ప్రభుత్వం సభ్యునిగా నియమించింది. ఇంగ్లండ్‌లో చాలా అరుదుగా ఇచ్చే పౌర పురస్కారం రైట్ ఆనరబుల్ను నాటి ప్రభుత్వం శాస్త్రికి (మాంటేగ్‌కు కూడా ఇదే బిరుదు ఉండేది) ఇచ్చింది. ఒకసారి నాగ్‌పూర్‌లో విద్యార్థులను ఉద్దేశించి శాస్త్రి వేసిన ప్రశ్నతో ఇది ముగించవచ్చు. 1905 నుంచి 1946 వరకు జరిగిన భారత స్వాతంత్య్రోద్యమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆయనే ఒక సందర్భంలో ఆ ప్రశ్న సంధించారు. ‘రాజకీయవేత్త జంటిల్మెన్ కాగలడా?’ అని. దానికి ఆయన సమాధానం సరే. అది ఎంతో ఆదర్శనీయంగా కూడా ఉంది. కానీ ఇప్పుడు వచ్చే సమాధానం ఏమిటి? · ∙డా. గోపరాజు నారాయణరావు -
ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ ఎస్సై కోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు అయింది. సివిల్ కేసులో తలదూర్చి శివప్రసాద్ అనే వ్యక్తిని అక్రమంగా నిర్బంధించి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి అతని ఆర్తనాదాలను రికార్డు చేసిన కేసులో ఆయనపై కేసులు నమోదయ్యాయి. అదృశ్యంలో ఉన్న ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
బెంగళూరులో కాల్పులు.. రెడ్ అలర్ట్
-
బెంగళూరులో కాల్పులు.. రెడ్ అలర్ట్
బెంగళూరు: బెంగళూరులో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివార్లలో ఓ కారును లక్ష్యంగా చేసుకొని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నగరంలోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) ప్రెసిడెంట్ కే శ్రీనివాస ప్రయాణిస్తున్న కారు.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. శ్రీనివాసతో పాటు తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌పై హత్యానేరంతో పాటు ఇతర కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ఓ కేసులో అరెస్టయిన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాల్పుల ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి సోదాలు నిర్వహిస్తున్నారు. -
వరుడైన శ్రీనివాసుడు
ద్వారకాతిరువుల : సర్వాభరణ భూషితుడైన శ్రీవారు నుదుటున కల్యాణతిలకం, బుగ్గనచుక్కతో పెండ్లి కువూరునిగా శోబిల్లారు. అలాగే పద్మావతి, ఆండాళ్ అవ్మువార్లు పెండ్లికువూర్తెలుగ ముస్తాబయ్యారు. శ్రీవారిని, అవ్మువార్లను పెండ్లికువూరుడు, పెండ్లికువూర్తెను చేÄýæుు వేడుకను చూసిన భక్తజనులు పరవశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరువులలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం నేత్రపర్వంగా ప్రారంభ వుయ్యాయి. తొలిరోజున స్వామివారు, అవ్మువార్లు పెండ్లి కువూరునిగాను, పెండ్లికువూర్తెలుగాను అలంకార భూషితులయ్యారు. ఆలయ పండితులు, అర్చకులు ఈ తంతును అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మేళతాళాలు, వుంగళ వాయిద్యాలు, వేద వుంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నావుస్మరణల నడువు ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత ఆలయ ప్రదక్షిణ వుండపంలో ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేసి సుగంధభరిత పుష్పవూలికలు, వూమిడితోరణలు, అరటి బోదెలుతో నయనానందకరంగా అలంకరించారు. అలాగే ఆలయ పరిసరాలను విశేష అలంకారాలతో తీర్చిదిద్దారు. వేదికపై ఏర్పాటుచేసిన రజిత సింహాసనంపై శ్రీవారు, అవ్మువార్ల ఉత్సవ వుూర్తులను వేంచేపుచేసి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విశేష పూజాధికాలు జరిపారు. ఎంతో అట్టహాసంగా నిర్వహించిన ఈవేడుకను అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధరావు దంపతులు, రాష్ట్ర దేవాదాయశాఖ ట్రిబ్యునల్ ఛైర్మన్ పీవీ.రమణరాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. . రాజాదిరాజ వాహనంపై ఊరేగిన శ్రీవారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మెుదటిరోజున జరిగే రాజాదిరాజ వాహన సేవకు ఎంతో ప్రావుుఖ్యత ఉంది. ఈ వాహనంలో కొలువైన గరుత్మంతుడు స్వామి, అమ్మవార్లను మోస్తున్నట్లు ఉన్న అలంకరణ భక్తులకు నేత్రపర్వమైంది. శ్రీవారి వైభవాన్ని చాటే ఈ వాహనసేవను మంగళవారం రాత్రి క్షేత్రపురవీదుల్లో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గజసేవనడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పువీదులకు పయనమైన స్వామివారిని అడుగడుగునా భక్తులు దర్శించి, నీరాజనాలను సమర్పించారు. శ్రీ హరికళాతోరణంలో జరపిని సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యంతం ఆకట్టుకున్నాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మాజీ మార్కెట్ కమిటీ ఫిర్యాదు మేరకు కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ వరంగల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. సోదాలు కొనసాగుతున్నాయి. -
తాగు నీరు లేక చిరుత పులి మృతి
ఎండల తీవ్రత పెరిగి.. తాగు నీరు అందని పరిస్థితుల్లో మూగ జీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కోటకొండ అటవీ ప్రాంతంలో ఇలానే ఓ చిరుత పులి మృతి చెందింది. స్థానికులు బుధవారం ఉదయం చూసి అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. డీఎఫ్‌వో శివప్రసాద్ సిబ్బందితో కలసి చనిపోయిన చిరుత పులిని పరిశీలించారు. తాగు నీరు లభించక మూడు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
భర్తను చంపించిన భార్య
శ్రీరామనగర్ : శ్రీరామనగర్‌కు సమీపంలోని బరుగూరు క్రాస్ దగ్గర ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించిన ఘటన హత్య కేసుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిలుకూరి శ్రీనివాసు(35)ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇతను ఈడుపుగంటి ప్రసాద్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనిలో చేరాడు. పని ఉన్నప్పుడల్లా శ్రీనివాసును పిలిచేందుకు అతని ఇంటి దగ్గరకు ప్రసాద్ వెళ్లేవాడు. ఈ క్రమంలో చిలుకూరి శ్రీనివాస్ భార్య జయలక్షి్ష్మతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రమాదమని జయలక్ష్మి భావించింది. ప్రియునితో కలిసి భర్త చిలుకూరి శ్రీనివాస్‌ను అంతమొందించాలని పథకం వేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పొలానికి నీళ్లు పెట్టాలని ప్రసాద్ ఒకరోజు రాత్రిపూట పిలుచుకెళ్లాడు. శ్రీనివాసుకు తాగుడు అల వాటు ఉండడంతో మాయమాటలు చెప్పి పీకలదాకా తాగించాడు. తర్వాత పథకం ప్రకారం గొంతుకు పగ్గంతో బిగించి తన స్నేహితుల సహకారంతో హత్య చేశాడు. మృతదేహాన్ని గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్లే రోడ్డుపై ఉంచి ప్రసాద్ తన ట్రాక్టర్‌ను మీద నడిపాడు. తర్వాత ఒక పాత సైకిల్‌ను అక్కడ ఉంచి గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లుగా నమ్మించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ప్రమాదంలో మృతిచెందలేదని, హత్య చేశారనే విషయం పోలీసులకు తెలిసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను, హతుడు శ్రీనివాసులు భార్య జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులును స్నేహితులు కృష్ణమూర్తి, బుడాసాబ్, సత్యనారాయణతో కలిసి హత్య చేసినట్లు ప్రసాద్ అంగీకరించాడు. దీంతో ప్రసాద్, కృష్ణమూర్తిని, జయలక్ష్మిని అరెస్టు చేశారు. సత్యనారాయణ, బుడాసాబ్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ ధర్మట్టి తెలిపారు. జరిగిన సంఘటన స్థలానికి పోలీసులతో పాటు సీఐ ధర్మట్టి, ఎస్ఐ ఉదయ్వ్రి, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, తమ్మినీడి వెంకటేశ్వరరావు, డీఆర్ ప్రసాద్, చిలుకూరి సత్యనారాయణ(బుజ్జి) తదితరులు చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతితో అతని ఇద్దరు సంతానం అనాథలయ్యారు. -
హుదూద్ బాధితులను ఆదుకుందాం
తిరుపతి కార్పొరేషన్ : హుదూద్ సృష్టించిన పెను తుపానుతో నిరాశ్రయులుగా మిగిలిన విశాఖ జిల్లా బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ పిలుపునిచ్చారు. బాధితులను వైద్య పరంగా ఆదుకునేందుకు తిరుపతి శ్రీసాయిసుధా మల్టీ ఆసుపత్రి, శ్రీరాళ్లపల్లి రాఘవ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా రూ.2.12 లక్షల విలువైన మందులు ఏర్పాటు చేశారు. వీటిని హాస్పిటల్ డెరైక్టర్లు డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా విశాఖపట్నంకు శుక్రవారం తరలించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరు ఎంపీ శివప్రసాద్, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రజల మనసు గొప్పదని నిరూపించారన్నారు. ఎంపీగా తన రెండు నెలల జీతంతో పాటు నిధులను కూడా బాధితులకు కేటాయిస్తామన్నారు. డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ విశాఖలోని బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి డాక్టర్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తమ వంతుగా రూ.2.12 లక్షల విలువైన పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, డ్రెస్సింగ్ మెటీరియల్స్, సిరప్లు, ఎనర్జీ డ్రింక్‌లు, ప్రొటీన్ పౌడర్లు, సెలైన్ బాటిల్స్, డయేరియా వంటి వ్యాధులకు మందులు అందించామన్నారు. డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, డాక్టర్ శ్రీహరి, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐఎంఐ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. కార్యక్రమంలో దంపూర్తి భాస్కర్, కృష్ణాయాదవ్, ఆర్సీ మునికృష్ణ, పత్తిపాటి వివేక్, దుగ్గాని జయరామ్ పాల్గొన్నారు. -
ఏ బాధ మృత్యువై తరిమిందో?!
నరసన్నపేట: అప్పుల బాధలు లేవు.. కుటుంబ సమస్యలు అంతకన్నా లేవు.. మరి ఏ కారణం వారిని మృత్యు సాగరం వైపు తరిమిందో గానీ.. ఒక కుటుంబం సముద్రంలో కలిసిపోవడానికి చేసిన ప్రయత్నంలో అభం శుభం తెలియని ఇద్దరు పసిపిల్లలతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో మరణించిన వారు నరసన్నపేటకు చెందిన వారు కావడంతో పట్టణంలో విషాదం అలుముకుంది. నరసన్నపేటకు చెందిన తంగుడు శ్రీనివాసరావు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ అవుట్ గేట్ వద్ద శ్రీనివాస స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు చరణ్‌దేవ్(3), చేతన్‌కుమార్(1) ఉన్నారు. ఈయనకు ఒక సోదరుడు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నాయి. గతంలో బెంగళూరులో ఉద్యోగం చేసిన శ్రీనివాసరావు యజమానితో వివాదం ఏర్పడటంతో ఉద్యోగం మానేసి నరసన్నపేట వచ్చేశాడు. అప్పటినుంచి స్వీట్ స్టాల్ ఏర్పాటు చేసుకొని జీవనం గడుపుతున్నాడు. కాగా చిన్న కుమారుడు అనారోగ్యానికి గురి కావడంతో డాక్టర్‌కు చూపించేందుకు శ్రీకాకుళం వెళుతున్నానని చెప్పి ఆదివారం ఉదయం పది గంటల సమయంలో శ్రీనివాసరావు భార్యాబిడ్డలతోపాటు ఇంటి నుంచి బయలుదేరాడు. శ్రీకాకుళం చేరుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసి మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చేస్తామని తన వదినతో చెప్పాడు. భోజన సమయం గడిచిపోయినా వారు రాకపోవడంతో తాను ఫోన్ చేసి వాకబు చేయగా శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళుతున్నామని, తమ గురించి ఎదురుచూడవద్దని శ్రీనివాసరావు చెప్పాడని అతని వదిన వివరించారు. అయితే ఆ తర్వాత సాయంత్రం, రాత్రి ఫోనులో వారితో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నట్లు సమాధానం వచ్చిందని ఆమె తెలిపారు. సోమవారం ఉదయానికైనా వారు తిరిగి వస్తారనుకుంటే.. వారి మరణ సమాచారం వచ్చిందని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. సముద్రంలో దూకి శ్రీనివాసరావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని.. వారిలో వెంకటలక్ష్మిని స్థానికులు రక్షించడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉందని స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులు సైతం చనిపోయారని తెలుసుకుని ఆ వీధిలోనివారు సైతం కన్నీరు పెట్టారు. తమ కుటుంబానికి ఎటువంటి సమస్యలు లేవని, ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని కుటుంబ సభ్యులు చెబుతుండగా.. శ్రీనివాసరావు చాలా మంచివాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని మరి ఎందుకు కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. కొన ఊపిరితో చికిత్స పొందుతున్న వెంకటలక్ష్మి కోలుకుంటే గానీ ఈ సంఘటనకు కారణాలు వెల్లడయ్యే అవకాశం లేదు. -
పెంపకాన్ని ఒక తపస్సులా చేశాం!
ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురబ్బాయిలు... ఆ త్రిమూర్తులే తమ ఇంట్లో వెలిశారని పొంగిపోయారు... ఈ తల్లిదండ్రులు. ఈ తండ్రికి అపారమైన దైవభక్తి. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం... ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడమే అసలైన దైవత్వం... అని నమ్ముతారు ఈ తల్లి. పిల్లలందరినీ ఉన్నతవిద్యావంతుల్ని చేయాలనుకున్నారు... దానినో తపస్సులా చేశారీ తల్లిదండ్రులు. ఆ తపస్సులో పొందాల్సిన వరాలన్నీ పొందారు కూడ. ఆ వరాలే మూడు తెల్లకోటులు... మూడు స్టెతస్కోపులు. పిల్లల పెంపకంలో శివాజీ... కల్యాణిల అనుభవాలే ఈ వారం లాలిపాఠం. తాడికొండ శివాజి స్వగ్రామం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం పైడూరిపాడు. తండ్రి రాఘవయ్యది వ్యవసాయ కుటుంబం. ఎనిమిది మంది సంతానం. నలుగురు అక్కలు, ఒక అన్న, ఓ తమ్ముడు, ఓ చెల్లెలు. చిన్నప్పుడు గేదెలు కాస్తూ, పొలం పనులకు వెళుతూ... బడికి తరచూ ఎగనామం పెడుతూ, ఎలాగో మూడోతరగతి వరకు చదివాడు. శివాజీ మేనమామలు కులవృత్తులు చేసేవారు. శివాజీ తల్లి అన్నపూర్ణమ్మ తన కుమారుణ్ని 12 ఏళ్ల వయస్సులో (1975) గుంటూరు జిల్లా నవులూరు గ్రామంలో ఉంటున్న తన రెండో అల్లుడు అప్పారావు వద్దకు పంపించింది.అతనికి మంగళగిరి పట్టణంలో క్షౌరశాల ఉండేది. జీరోతో జీవితాన్ని ప్రారంభించిన శివాజీ కులవృత్తిలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆ వివరాలు శివాజి మాటల్లోనే... ‘‘మా బావ షాపులో నాలుగేళ్లపాటు పనిచేశాక... ఆయన తనకున్న రెండు క్షౌరశాలల్లో ఒక షాపు బాధ్యతను నాకప్పగించారు. ఆ తర్వాత...1982లో మా పెద్దక్కయ్య గారి అమ్మాయి కల్యాణితో నాకు వివాహమైంది. మరో నాలుగేళ్లకి 1986లో సొంతంగా మంగళగిరిలోనే ‘శివాజి హెయిర్‌స్టయిల్’ పేరుతో షాపు పెట్టుకున్నాను. ఆ వివక్ష నా పిల్లలకు ఎదురు కాకూడదనే..! నా వృత్తిద్వారా వచ్చే డబ్బును ఇంట్లో ఒక రేకు డబ్బాలో వేసేవాడ్ని. నా భార్య కల్యాణి వాటిని 15 రోజులకో.. నెలకో ఓ మారు లెక్కించి ఇంట్లో అవసరాలకు పోనూ మిగతా డబ్బుని బ్యాంక్ అకౌంట్లో జమచేయమని ఇచ్చేది. నాకు చదువులేకపోవడం వల్ల బ్యాంకు లావాదేవీలకు ఇతరులపై ఆధారపడాల్సివచ్చేది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆయా వ్యక్తులు నా పట్ల గౌరవప్రదంగా వ్యవహరించేవారు, కానీ నేను క్షౌరవృత్తి చేస్తానని తెలియగానే వారి ముఖకవళికలు మారిపోయేవి. నా వృత్తిలో నేను గొప్పగా రాణిస్తున్నాను. ఎవరి నుంచి ఏదీ ఆశించకుండా, ఎవరి మీదా ఆధారపడకుండా జీవిస్తున్నాను. కానీ సమాజపరంగా ఈ వృత్తిని విలువైనదిగా గుర్తించకపోవడం ఇబ్బందికరంగా ఉండేది. నా పిల్లలను గౌరవప్రదమైన వృత్తిలో చూసుకోవాలనే కోరిక కలగడానికి కారణం కూడా నాకు ఎదురైన వివక్షే. పిల్లల్ని ఉన్నత విద్య చదివించాలనుకున్నాను. దైవశక్తిపై నమ్మకం! నాకు, కల్యాణికి మొదటి నుంచి దైవశక్తిపై నమ్మకం ఎక్కువే. పిల్లలను దైవఫలంగా అనుకునేవాళ్లం. సత్యవిష్ణుదేవుని వరపుత్రునిగా భావించి మొదటిబాబుకు సవీష్వర్మ అని నామకరణం చేశాం. రెండోబాబుకు వీరాంజనేయ వరపుత్రుడిగా భావించి విజేష్వర్మ అనీ, మూడో బాబుకు శ్రీమహాలక్ష్మి వరప్రసాదంగా భావించి శిరీష్‌వర్మ అని పేర్లు పెట్టాం. పిల్లలకు బడి ఈడుకు వచ్చేనాటికి (1987) నవులూరులోనే ఫణీంద్ర విద్యానికేతన్ అనే ఇంగ్లిష్ మీడియం స్కూల్ పెట్టారు. అందులో టీచర్లు అందరూ మహిళలే. మగవాళ్లు అయితే సిగరెట్లు తాగడం, దురుసుగా వ్యవహరిస్తారని, అటువంటి దృశ్యాల ప్రభావం పిల్లల మీద ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకే మహిళా టీచర్లు మాత్రమే ఉండే స్కూల్లో చేర్పించాను’’ అన్నారు శివాజీ. ముగ్గురు పిల్లల్నీ ఒకేలా చూశాను! ఇంటిని ఒద్దికగా దిద్దుకోవడానికి కారణం తండ్రి నేర్పిన బాధ్యతలేనంటారు కల్యాణి. ‘‘మాది కొండపల్లి. మా నాన్న జమలాపురపు కనకరాజు, ఆయన నాస్తికుడు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా, మన పనిని ఎదుటివారి నెత్తిన రుద్దకుండా బాధ్యతగా ఉండాలని చెప్పేవారు. నేను ఇంటికి పెద్దదాన్ని. ఏడో తరగతి వరకు చదివిన తర్వాత స్కూలు మానిపించి నాకు ఇంటి పనులు అలవాటు చేశారు. దాంతో పెళ్లయిన తర్వాత ఇంటిని దిద్దుకోవడం పెద్ద కష్టం కాలేదు. మా పిల్లలు స్కూల్‌కు వెళ్లే వయస్సు వచ్చేసరికి నాకు పుట్టింటికి వెళ్లడం కూడా కుదిరేది కాదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పిల్లలను స్కూల్‌కు పంపి నేను కొండపల్లి వెళ్లేదాన్ని. మళ్లీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేసేదాన్ని. పెంపకంలో నేను పాటించిన పెద్దపెద్ద నియమాలేవీ లేవు కానీ, ఒక విషయాన్ని మాత్రం నా పిల్లల దగ్గర జరక్కుండా జాగ్రత్తపడ్డాను. కొన్ని కుటుంబాల్లో ఒక బిడ్డపై ఎక్కువ ప్రేమ చూపడం, ఒక బిడ్డను తక్కువగా చూడడం గమనించాను. అలా నిరాదరణకు గురవుతున్న పిల్లలను చూస్తే చాలా బాధనిపించేది. నాకు మాత్రం ముగ్గురు పిల్లలపై సమభావం ఉండేది. ముగ్గురిలో మూడోవాడు చదువులో వెనకబడి ఉండేవాడు. అయితే, ఆటల్లో ప్రైైజులు తెచ్చేవాడు. ముగ్గురూ సమంగా ఉండాలని, అన్నయ్యల్లా నువ్వు కూడా బాగా చదవాలని చెప్పేదాన్ని. నేను చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించేవాడు కాదు, కానీ రాను రాను చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు’’ అన్నారు కల్యాణి. ఎందులో సీటు తెచ్చుకుంటే అదే చదివించాలనుకున్నా! పెదబాబును డాక్టర్ చేయాలనే తలంపుతో విజయవాడ శ్రీచైతన్యలో ఇంటర్ బైపీసీలో చేర్పించాం. ఎంసెట్ రాస్తే... ఆయుర్వేదం కోర్సులో సీటొచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో చదివాడు. ఇక్కడో విషయం చెప్పాలి. పెదబాబుకు ఇంటర్ రెండేళ్ల చదువుకుగాను 65 వేల రూపాయలైంది. చాలామంది తెలిసినవాళ్లు ‘మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎకరం ధర ముప్పైవేలు ఉంది. అంత ఖర్చు పెట్టి ఇంటర్ చదివించాలా? పొలం కొనుక్కోవచ్చు కదా’ అనేవారు. ఆ మాటలేవీ పట్టించుకోలేదు. పెదబాబుకు డాక్టర్ సీటు రావడంతో మిగతా ఇద్దరికీ అదే చదువు చెప్పించాలనుకున్నా. ఇద్దరికీ లక్షా 40 వేలయింది. రెండోబాబుకు ఎంసెట్‌లో 176వ ర్యాంక్ వచ్చింది. మావాడికి ఓపెన్ కేటగిరిలో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఎలాట్ అయిందని తెలియగానే ఎంతో గర్వంగా ఫీలయ్యా. ఇక మూడోబాబుకు గుడివాడలో బీహెచ్ఎంఎస్ సీటు వచ్చింది’’ అని గుర్తుచేసుకున్నారు శివాజీ. ముగ్గురు పిల్లల్ని ఆయుర్వేదం, అల్లోపతి, హోమియా వైద్య కోర్సుల్లో ఎందుకు చేర్పించారని అడగ్గా... ‘‘ఎంసెట్ మొదటి ప్రయత్నంలో ఏ సీటు వస్తే అదే చదివించాలనుకున్నాం. అలాగే వచ్చిన సీట్లలో జాయిన్ చేశాం. మా పిల్లలకు కట్నం తీసుకోదల్చుకోలేదు... ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లు చేశారు కదా అని ప్రస్తావించగా.. నేను పెళ్లి చేసుకున్నప్పుడు కట్నంగా మూడు వేల రూపాయలు ఇచ్చారు. కట్నం తీసుకున్నందుకు ఇప్పటికీ గిల్టీగా ఫీలవుతుంటా. అందుకే మా పిల్లలకు నేను కట్నం తీసుకోదల్చుకోలేదు. మా అబ్బాయిలకు భారీ కట్నకానుకలు ఇస్తామని సంబంధాలు వచ్చాయి. కానీ కట్నం తీసుకోకూడదనే నా అభిప్రాయంతో ఇంట్లో అందరూ ఏకీభవించారు. పెదబాబు సవీష్వర్మ ఎండీ (రసశాస్త్ర) చేసి తన జూనియర్ దీప్తిని గత ఏడాది డిసెంబర్ 9న వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ బీఏఎంఎస్‌లో స్టేట్ గోల్డ్‌మెడలిస్టులు. రెండోబాబు విజేష్వర్మకు మా బంధువుల అమ్మాయి రాణిశిరీషతో ఈ ఏడాది మే 30న వివాహమైంది. బీడీఎస్ చేసిన రాణిశిరీష గుంటూరు సిబార్ దంతవైద్యకళాశాలలో ఎండీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడోబాబు శిరీష్‌వర్మ బీహెచ్ఎంఎస్, ప్రాక్టీస్ యోచనలో ఉన్నాడు’’ అన్నారు శివాజీ. నా కూతురైతే అన్ని పనులు చేయిస్తానా! పెద్దకోడలు విజయవాడలో భర్తతోపాటే ప్రాక్టీసు చేస్తున్నారు. మరి రెండోకోడలు మీ ఇంటి వద్ద నుంచే ఎండీఎస్ చదివేందుకు గుంటూరు వెళుతున్నారు కదా. ఇప్పటికీ మీకు ఇంటి పనిలో విశ్రాంతి వచ్చినట్టు లేదు అన్నప్పుడు కల్యాణి చాలా ఉన్నతంగా స్పందించారు. ‘‘శిరీష ఎండీఎస్ చదవాలని పీజీ ఎంట్రన్స్ రాసింది. ఇంతలో పెళ్లి చేశాం. గుంటూరులోని సిబార్ దంత వైద్యకళాశాలలో ఎండీఎస్ సీటు వచ్చింది. ఆ అమ్మాయిది పని చేసే మనస్తత్వమే కానీ నాకే మనసు ఒప్పుకోలేదు. పొద్దున్న కాలేజికెళ్లి సాయంత్రానికి వస్తుంది. అలసట, ప్రయాణ బడలిక ఉంటాయి. ఆ పరిస్థితిలో నా కూతురు ఉంటే ఇంటి పనులు చెప్పను కదా. అదే ఉద్దేశంతో నేను శిరీషకు ఇంటి పనులు చెప్పడం లేదు. డాక్టర్ల అమ్మ! మా ముగ్గురు పిల్లలూ డాక్టర్లు అయినా నాకు ప్రత్యేకంగా ఎలాంటి ఫీలింగ్ ఉండేది కాదు. అయితే, ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు బంధువులు, తెలిసినవాళ్లు.. ‘ముగ్గురు డాక్టర్ల అమ్మ’ అని మెచ్చుకోలుగా అంటుంటారు. ఆ సందర్భాల్లో మాత్రం నాకెంతో గర్వంగా ఉంటుంది’’ అన్నారు కల్యాణి. ఇక మూడోబాబుకు కూడా పెళ్లి చేస్తే మీ బాధ్యతలు తీరిపోతాయి. ఇంతకీ మీరు పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారన్నప్పుడు... ‘‘సమాజంలో పిల్లలు గౌరవప్రదమైన స్థానాల్లో, సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆశిస్తున్నాం’’ అన్నారు శివాజీ దంపతులు. ఈ తల్లిదండ్రుల ఆశ నెరవేరాలని ఆశిద్దాం. - అవ్వారు శ్రీనివాసరావు, సాక్షి, గుంటూరు ఫొటోలు: పల్లి ప్రకాష్‌బాబు, సీహెచ్ సుధాకర్ అడిగి మరీ ష్యూరిటీ ఇచ్చారు! రెండోబాబుకు ఎండీ పీడియాట్రిక్స్‌లో సీటు వచ్చినప్పుడు 20 లక్షల రూపాయలకు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్లు ఇద్దరు బాండ్ ఇవ్వాలన్నారు. ‘నా కొడుక్కి ష్యూరిటీ ఉండండి’ అని ఎవర్ని అడగాలో తెలియక మధన పడ్డాను. నా రెగ్యులర్ కష్టమర్ అయిన వేమూరి నాగేశ్వరరావుగారికి ఈ విషయం తెలిసి ‘నేను గెజిటెడ్ ఆఫీసర్ని, సంతకం పెడతాను’ అన్నారు. ఆ దేవుడే వచ్చాడని సంతోషించాను. మా మరో కష్టమర్ డాక్టర్ రాంబాబుగారు రెండో సంతకం పెట్టారు. - శివాజీ