Tirupati Mla Bhumana Karunakar Reddy Reacts Srinivasa Setu Accident - Sakshi
Sakshi News home page

Srinivasa Setu: శ్రీనివాస సేతు ప్రమాదం బాధాకరం.. మృతుల కుటుంబాల్ని ఆదుకుంటాం

Published Thu, Jul 27 2023 8:57 AM | Last Updated on Thu, Jul 27 2023 8:27 PM

tirupati mla bhumana karunakar reddy Reacts Srinivasa Setu Accident - Sakshi

సాక్షి, తిరుపతి: ఫ్లైఓవర్‌ పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో.. ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణార్‌ రెడ్డి. శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదంపై స్పందించిన ఆయన.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని ప్రకటించారు. సహాయక కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘పనులు చివరి దశకు చేరుకున్నాయి. కేవలం మూడు సెగ్మెంట్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ట్రైల్ రన్ నిర్వహించాలని నిర్ణయించాం, ఇప్పటి వరకు చిన్న సంఘటన కూడా జరగలేదు..భగవంతుడు దయ వల్ల అంతా మంచి జరిగింది అనుకున్న తరుణంలో ఈ సంఘటన బాధాకరం. మెకానికల్ ప్రోబ్లం కారణంగా భారీ క్రేన్ కేబుల్ తెగడంతో ప్రమాదం జరిగింది.

700 టన్నుల కెపాసిటీ గల భారీ క్రేన్ 70 టన్నుల సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తుండగ కేబుల్ తెగి ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా, ప్రభుత్వము నుంచి సహకారం అందించి ఆదుకుంటాం అని ఎమ్మెల్యే భూమన తెలిపారు. 

శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ ప్రమాదం
భారీ క్రేన్ సిమెంట్ సెగ్మెంట్ లిఫ్ట్ చేస్తున్న సమయంలో కేబుల్స్ తెగి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ సెగ్మెంట్ కింద పడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 70-80 టన్నుల బరువున్న సిమెంట్ సెగ్మెంట్ పడడంతో బాడీలు నుజ్జు నుజ్జు అయ్యాయి. మృతులు బీహార్ రాష్ట్రం కథియార్ జిల్లాకు చెందిన బార్థో మండల్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవిజిత్ ఘోష్‌గా గుర్తించారు. భారీ క్రేన్ సహాయంతో సిమెంట్ సెగ్మెంట్ ను తొలగించి.. డెడ్ బాడీ లను రుయా ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement