బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌ | Bengaluru has been placed on red alert after shots were fired at a car on the outskirts of the city | Sakshi
Sakshi News home page

బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

Published Fri, Feb 3 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

బెంగళూరులో కాల్పులు.. రెడ్‌ అలర్ట్‌

బెంగళూరు: బెంగళూరులో శుక్రవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. నగర శివార్లలో ఓ కారును లక్ష్యంగా చేసుకొని మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.

నగరంలోని అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌ మార్కెట్‌ కమిటీ(ఏపీఎంసీ) ప్రెసిడెంట్‌ కే శ్రీనివాస ప్రయాణిస్తున్న కారు.. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగిన సమయంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. శ్రీనివాసతో పాటు తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్‌పై హత్యానేరంతో పాటు ఇతర కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2013లో ఓ కేసులో అరెస్టయిన ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. కాల్పుల ఘటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించి సోదాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement