భర్తను చంపించిన భార్య | Husband killed wife | Sakshi
Sakshi News home page

భర్తను చంపించిన భార్య

Published Mon, Oct 27 2014 3:04 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Husband killed wife

శ్రీరామనగర్ : శ్రీరామనగర్‌కు సమీపంలోని బరుగూరు క్రాస్ దగ్గర ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించిన ఘటన హత్య కేసుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిలుకూరి శ్రీనివాసు(35)ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇతను ఈడుపుగంటి ప్రసాద్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనిలో చేరాడు. పని ఉన్నప్పుడల్లా శ్రీనివాసును పిలిచేందుకు అతని ఇంటి దగ్గరకు ప్రసాద్ వెళ్లేవాడు.

ఈ క్రమంలో చిలుకూరి శ్రీనివాస్ భార్య జయలక్షి్ష్మతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రమాదమని జయలక్ష్మి భావించింది. ప్రియునితో కలిసి భర్త చిలుకూరి శ్రీనివాస్‌ను అంతమొందించాలని పథకం వేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పొలానికి నీళ్లు పెట్టాలని ప్రసాద్ ఒకరోజు రాత్రిపూట పిలుచుకెళ్లాడు. శ్రీనివాసుకు తాగుడు అల వాటు ఉండడంతో మాయమాటలు చెప్పి పీకలదాకా తాగించాడు.

తర్వాత పథకం ప్రకారం గొంతుకు పగ్గంతో బిగించి తన స్నేహితుల సహకారంతో హత్య చేశాడు. మృతదేహాన్ని గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్లే రోడ్డుపై ఉంచి ప్రసాద్ తన ట్రాక్టర్‌ను మీద నడిపాడు. తర్వాత ఒక పాత సైకిల్‌ను అక్కడ ఉంచి గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లుగా నమ్మించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ప్రమాదంలో మృతిచెందలేదని, హత్య చేశారనే విషయం పోలీసులకు తెలిసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను, హతుడు శ్రీనివాసులు భార్య జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో శ్రీనివాసులును స్నేహితులు కృష్ణమూర్తి, బుడాసాబ్, సత్యనారాయణతో కలిసి హత్య చేసినట్లు ప్రసాద్ అంగీకరించాడు. దీంతో ప్రసాద్, కృష్ణమూర్తిని, జయలక్ష్మిని అరెస్టు చేశారు. సత్యనారాయణ, బుడాసాబ్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ ధర్మట్టి తెలిపారు. జరిగిన సంఘటన స్థలానికి పోలీసులతో పాటు సీఐ ధర్మట్టి, ఎస్‌ఐ ఉదయ్వ్రి, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, తమ్మినీడి వెంకటేశ్వరరావు, డీఆర్ ప్రసాద్, చిలుకూరి సత్యనారాయణ(బుజ్జి) తదితరులు చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతితో అతని ఇద్దరు సంతానం అనాథలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement