the scheme
-
పథకం ప్రకారం హత్య చేశారు
రాయచోటిటౌన్ /సుండుపల్లె: అత్యాశ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీస్తే కానీ ఆ ధనం అంతా తనకు రాదని తెలిసి నలుగు వ్యక్తులతో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దీని కోసం మరో మహిళను ఎరగా వాడుకున్నారు.గత సంవత్సరం డిశంబర్ 15వ తేదీ రాత్రి సానిపాయ కొండ సమీపంలోని మామిడి తోటలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుడి కుమార్తె హైమావి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేవీపల్లెకు చెందిన ఎల్ల య్య సుండుపల్లె మండలం ముడుంపాడు కురవపల్లెకు చెందిన రెడ్డెమ్మను వివాహం చేసుకుని కొద్ది సంవత్సరాల తరువాత అత్తారింటికే కా పురం వచ్చేశాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. బతుకుదెరువు కోసం 15 సంవత్సరాల క్రితం రెడ్డెమ్మ కువైట్‌కు వెళ్లింది. ఇదే గ్రామానికి చెందిన రెడ్డప్ప నాయుడు కూడా కువైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో రెడ్డెప్పనాయుడితో రెడ్డమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని సన్నిహిత సంబంధంగా మార్చుకునేందుకు రెడ్డప్పనాయుడు పథకం వేశాడు. కువైట్‌లోనే ఉంటున్న తన బావమరిది మహేష్‌నాయుడుకు పథకాన్ని వివరించారు. మరికొందరితో చర్చించి వ్యూహం పన్నారు. దీనికోసం చిట్వేల్‌కు చెందిన సుధారాణి అనే మహిళను ఎరగా ఎంచుకున్నారు. దీంతో ఆమె ఎల్లయ్యకు ఫోన్ చేసి తన దగ్గరకు పిలుపించుకునేది. ఈ నేపథ్యంలో ఎల్లయ్యతో పాటు మేహఃష్నాయుడు( కేవీపల్లె) శ్రీరాములు కురవపల్లె (ఫింఛా) మాతయ్య ( సానిపాయి) సుధారాణి డిసెంబర్ 25వ తేదీ రాత్రి సానిపాయి సమీపంలోని మామిడి తోటల్లోకి వెళ్లారు. తనకు బీరు తాగే అలవాటు ఉందని సుధారాణి ఎల్లయ్యకు చెప్పడంతో సుండుపల్లె నుంచి మరో వ్యక్తితో బీరుతో పాటు మద్యం బాటిళ్లను కూడా తెప్పించారు. ఇద్దరు కలసి మద్యం బాగా తాగారు. కొద్దిసేపటికే ఎల్లయ్య మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం ఎల్లయ్య ఊపిరి ఆడనీయకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. -
పకడ్బందీగా ‘తెలంగాణ హరిత హారం’
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ హరిత హారాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయూలని జిల్లా కలెక్టర్ జీడి ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ‘తెలంగాణ హరిత హారం’పై జిల్లాస్థాయి పర్యవేక్షక, సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఈ పథకం కింద జిల్లాలో 2014-15 సంవత్సరానికి గాను 5.60కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఇది వరకే ప్రతిపాదనలు పంపామని, వెంటనే ప్రణాళికలు సిద్దం చేయూలని ఆదేశించారు. ఇందుకుగాను 530 నర్సరీలలో ముందుగా మొక్కలు పెంచిన అనంతరం వాటిని గుర్తించిన స్థానాల్లో నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సరీలలో మొక్కలు పెంచేందుకు అటవీశాఖతో పాటు, డీఆర్డీఏ డ్వామా, వ్యవసాయ శాఖలు బాధ్యతలు తీసుకోవాల్సి ఉందన్నారు. మొక్కల పెంపకానికి గాను ఆయా ఏజెన్సీలు రూపొందించిన అంచనాలను సమర్పించేలా చూడాలన్నారు. అనుకున్న సమయం ప్రకారం మొక్కల పెంపకంతో పాటు, మొక్కలు నాటే కార్యక్రమాలన్ని కూడా పూర్తి చేయాలని కోరారు. రహదారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, గృహాలు, గట్లపై మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. మొక్కలను పెంచేందుకు నర్సరీలను గుర్తించి పక్రియను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓలు వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, వెంకటరమణ, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవీందర్, వ్యవసాయశాఖ జేడీ భగవత్ స్వరూప్, ఉద్యాన శాఖ ఏడీ సోమిరెడ్డి, సాంఘీక సంక్షేమాధికారి శ్రీనివాస్‌రావు, ఏపీడీ మల్లికార్జున్ పాల్గొన్నారు. పురాతన కట్టడాలను పరిర క్షణకు కృషి జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన కట్టడాలను పరిరక్షించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్ రెడ్‌క్రాస్ సమావేశమందిరంలో జిల్లా ఇంటాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రకృతిపరంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. జిల్లాలో కళాకారులు, కళలకు కొద వ లేదని, చరిత్ర, సంస్కృతిపరంగా పా లమూరు పేద జిల్లాకాదన్నారు. ఇంటాక్ కన్వీనర్ నాగేంద్రస్వామి మాట్లాడు తూ జిల్లా చరిత్ర, సంస్కృతి, పురాతన సంప్రదాఆల పరిరక్షణకు 1988లో ఇంటాక్ ఏర్పాటు చే శారన్నారు. -
భర్తను చంపించిన భార్య
శ్రీరామనగర్ : శ్రీరామనగర్‌కు సమీపంలోని బరుగూరు క్రాస్ దగ్గర ఈ నెల 10వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు చిత్రీకరించిన ఘటన హత్య కేసుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆదివారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిలుకూరి శ్రీనివాసు(35)ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఇతను ఈడుపుగంటి ప్రసాద్ అనే వ్యక్తి వద్ద డ్రైవర్‌గా పనిలో చేరాడు. పని ఉన్నప్పుడల్లా శ్రీనివాసును పిలిచేందుకు అతని ఇంటి దగ్గరకు ప్రసాద్ వెళ్లేవాడు. ఈ క్రమంలో చిలుకూరి శ్రీనివాస్ భార్య జయలక్షి్ష్మతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ప్రమాదమని జయలక్ష్మి భావించింది. ప్రియునితో కలిసి భర్త చిలుకూరి శ్రీనివాస్‌ను అంతమొందించాలని పథకం వేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను పొలానికి నీళ్లు పెట్టాలని ప్రసాద్ ఒకరోజు రాత్రిపూట పిలుచుకెళ్లాడు. శ్రీనివాసుకు తాగుడు అల వాటు ఉండడంతో మాయమాటలు చెప్పి పీకలదాకా తాగించాడు. తర్వాత పథకం ప్రకారం గొంతుకు పగ్గంతో బిగించి తన స్నేహితుల సహకారంతో హత్య చేశాడు. మృతదేహాన్ని గంగావతి నుంచి సింధనూరు వైపు వెళ్లే రోడ్డుపై ఉంచి ప్రసాద్ తన ట్రాక్టర్‌ను మీద నడిపాడు. తర్వాత ఒక పాత సైకిల్‌ను అక్కడ ఉంచి గుర్తు తెలియని వాహనం ఢీకొన్నట్లుగా నమ్మించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ ప్రమాదంలో మృతిచెందలేదని, హత్య చేశారనే విషయం పోలీసులకు తెలిసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు ప్రసాద్‌ను, హతుడు శ్రీనివాసులు భార్య జయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులును స్నేహితులు కృష్ణమూర్తి, బుడాసాబ్, సత్యనారాయణతో కలిసి హత్య చేసినట్లు ప్రసాద్ అంగీకరించాడు. దీంతో ప్రసాద్, కృష్ణమూర్తిని, జయలక్ష్మిని అరెస్టు చేశారు. సత్యనారాయణ, బుడాసాబ్ ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ ధర్మట్టి తెలిపారు. జరిగిన సంఘటన స్థలానికి పోలీసులతో పాటు సీఐ ధర్మట్టి, ఎస్ఐ ఉదయ్వ్రి, కనకగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డిశ్రీనివాస్, తమ్మినీడి వెంకటేశ్వరరావు, డీఆర్ ప్రసాద్, చిలుకూరి సత్యనారాయణ(బుజ్జి) తదితరులు చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ శ్రీనివాస్ మృతితో అతని ఇద్దరు సంతానం అనాథలయ్యారు. -
అక్కరకురాని ‘రైతుబంధు'!
జడ్చర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న రైతుబంధు పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం ప్రచారానికే పరిమితమైందని రైతుల నుంచి విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు పంటలు అమ్ముకుని నష్టపోకుండా కొంతకాలం పాటు సరుకులను గోదాముల్లో నిల్వఉంచి ఆశిం చినధర పలికినప్పుడు అమ్ముకుని లాభం పొందాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. స్థానిక బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఓ రైతుకు అధికారులు చుక్కలుచూపారు. మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్‌నాయక్ 86 బస్తాల మొక్కజొన్నను మూ డురోజుల కిందట బాదేపల్లి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అయితే మార్కెట్లో సరైన ధరలు లభించకపోవడంతో రైతుబంధు పథకాన్ని వినియోగించుకోవాలని భావించి మార్కెట్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రైతు తెచ్చిన ధాన్యాన్ని యార్డు ఆవరణలోని గోదాములో నిల్వఉంచి రైతుబంధు పథకం కింద రుణం ఇచ్చేం దుకు ధ్రువీకరణపత్రం కూడా రైతుకు అందజేశారు. తనకు రుణం అందుతుందని, తన కుమారుడి చదువులకు అవసరమయ్యే రూ.60వేలు సర్దుబా టు అవుతాయని ఆశించాడు. తీరా రేపుమాపు అని మార్కెట్ అధికారులు కాలయాపన చేస్తుండడంతో దిక్కుమొహం వేసుకుని చూస్తున్నాడు. ఈ విషయాన్ని కొందరు రైతుసంఘం నేతలు మార్కెట్‌కమిటీ సహాయ కార్యదర్శి అబ్దుల్ సమీ దృష్టికి తీసుకెళ్లగా..రైతుబంధు పథకం కింద రుణం మంజూరుచేసేందుకు తమకు అధికారాలు లేవని స్పష్టంచేశారు. రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం రుణం మంజూరుచేస్తామని యార్డు కార్యదర్శి అనంతయ్య వెల్లడించారు. రైతులకు సకాలంలో రుణం మంజూరుచేయకపోవడం దారుణమని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కరకల కృష్ణారెడ్డి తెలిపారు. జాప్యం ఎక్కడంటే! ధాన్యాన్ని భద్రపర్చుకున్న రైతుకు పంటఉత్పత్తి మార్కెట్ విలువను బట్టి 75శాతం రుణం రుపేణా ఇవ్వాలి. ఈ డబ్బుకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. మళ్లీ ఆశించినధరకు అమ్ముకుడుపోయిన తరువాత సదరు రైతు తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే రుణం ఇచ్చేందుకు మొద ట మార్కెట్‌శాఖ జిల్లాస్థాయి ఉన్నతాధికారి ధ్రువీకరించాలి. ఆ తరువాత సంబంధిత మార్కెట్‌యార్డు కార్యదర్శి సమ్మతిస్తే రుణం తీసుకోవచ్చు. బాదేపల్లి మార్కెట్లో రైతుబంధు పథకం కింద రైతు లక్ష్మణ్‌నాయక్‌కు రుణం ఇచ్చేందుకు ఉన్నతాధికారులు తాత్సారం వహిస్తున్నారు. జిల్లాలో ఇలా.. మొక్కజొన్న పంట దిగుబడులు ఇప్పుడిప్పుడే రైతుల చేతికొస్తున్నాయి. బాదేపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ మార్కెట్లో విక్రయాలు ఊపందుకున్నా యి. బాదేపల్లి మార్కెట్లో శనివారం ఒకేరోజు సుమారు 60వేల క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ మద్దతుధర రూ.1310 కాగా, రైతులకు ఎక్కడా దరిదాపుల్లోకి కూడా ఇవ్వడం లేదు. కనిష్టంగా రూ.800, గరిష్టంగా రూ.1040 ధర చెల్లిస్తున్నారు. జిల్లాలోని అన్ని మార్కెట్లలో దాదాపు ఇదేధర అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్న రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకుంటు న్నా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కలెక్టర్ స్పందించి రైతుబంధు పథకం అమలయ్యేలా చూడాలన్నారు. -
చెంబట్క పోవుడే..!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పడకేసింది. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు కనీసం సగం కూడా పూర్తికాలేదు. మొదట్లో నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులు.. ఇప్పుడు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణం అంచనా వ్యయం పెరగనుందనే ప్రచారం జరుగుతుండడంతో పథకం ముందుకు సాగడంలేదు. చొప్పదండి : జిల్లాలో 2.20 లక్షల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యూరుు. వీటిలో ఈ నెల రెండో వారం వ రకు కేవలం 72 వేల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యూరుు. మరో 30 వేలు పగతిలో ఉన్నారుు. ఇంకా 1.18 లక్షలు అసలే ప్రారంభం కాలేదు. పూర్తరుున వాటికి డబ్బులు మంజూరు చేసిన సంబంధిత శాఖ అధికారు లు.. పూర్తికాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా పథకంలో ఎలాం టి పురోగతి లభించడంలేదనే ఆరోపణలున్నారుు. గత యూపీఏ ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు కేటారుుంచిం ది. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 900 పోను ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4,500, నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద లబ్ధిదారుడికి రూ. 4,600 అందించింది. ఎన్నిక ల ముందు ఉపాధి హామీ పథకం మొత్తాన్ని పెంచింది. కుటుంబంలో జాబ్‌కార్డు ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి రోజుకు రూ.149 చొప్పున కూలీతో 35 రోజుల పనిదినాలు కల్పించి రూ. 5,275లు చెల్లించింది. పూర్తయిన నిర్మాణాలకు రంగులు అద్దేందుకు.. ఫొటో దిగేందుకు అదనంగా రూ. 125 చొప్పున కేటారుుంచింది. నిలిచిన నిర్మాణాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి సాధించడం లేదు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్నా.. పెరిగిన ధరలతో ప్రభుత్వ సాయం సరిపోవ డం లేదని పేదలు ముందుకు రావడం లేదు. ఎంత తక్కువ ఖర్చుతో నిర్మించినా రూ. 20 వేలకు పైగా అవుతున్నాయని పలువురు వాపోయారు. మంజూరైన పలువురు లబ్ధిదారులకు ఇంటి ఆవరణలో సరిపడా స్థలం లేక కూడా నిర్మాణాలు ప్రారంభించ లేదు. పలు మండలాలలో పావలావంతు కూడా పూర్తికాలేదు. పెరగనున్న సాయం? గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం కోసం ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే సంకల్పంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేల వరకు లబ్ధిదారులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చారుు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. కాగా పెంచే మొత్తంపై ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ఖరాలుకాలేదు. అధికారులూ ఏమి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే మంజూరై నిర్మాణం పూర్తిచేసుకున్న వారికి బిల్లు మంజూరు చేసిన అధికారులు.. మొన్నటి ఎన్నికల తర్వాత కొత్తగా ఎవరికీ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరూ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకంపై లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన అనుమతులు పూర్తి చేసి.. కొత్తగా మంజూరు చేసే వాటికే కొత్త పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఉపాధి హామీ సిబ్బంది అంటున్నారు. నిర్మల్ భారత్ అభియూన్ అమలుకు, ఉపాధి హామీ పథకంతో సంబందం లేకుండా చేస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రూపొందించే కొత్త పథకం అమలవుతుందా..? లేదా..? అమలైనా అది ఎప్పటి నుంచి అనే క్లారిటీపై అన్ని సందేహాలే ఉన్నారుు. అప్పటి వరకు ఈ పథకం ముందుకు సాగే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడంలేదు. ఎలాంటి ఉత్తర్వులు రాలేదు.. - లక్ష్మి, ఏపీవో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. డబ్బులు సరిపోవడం లేదని చాలామంది నిర్మాణాలు చేపట్టడంలేదు. మరికొందరు స్థలం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే పథకం వందశాతం పూర్తికావడం లేదు. మరుగుదొడ్లు అందరూ నిర్మించుకోవాలి. పారిశుధ్య పరిరక్షణకు తోడ్పడాలి.