పథకం ప్రకారం హత్య చేశారు
రాయచోటిటౌన్ /సుండుపల్లె: అత్యాశ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీస్తే కానీ ఆ ధనం అంతా తనకు రాదని తెలిసి నలుగు వ్యక్తులతో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. దీని కోసం మరో మహిళను ఎరగా వాడుకున్నారు.గత సంవత్సరం డిశంబర్ 15వ తేదీ రాత్రి సానిపాయ కొండ సమీపంలోని మామిడి తోటలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మృతుడి కుమార్తె హైమావి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుండుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సోమవారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేవీపల్లెకు చెందిన ఎల్ల య్య సుండుపల్లె మండలం ముడుంపాడు కురవపల్లెకు చెందిన రెడ్డెమ్మను వివాహం చేసుకుని కొద్ది సంవత్సరాల తరువాత అత్తారింటికే కా పురం వచ్చేశాడు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. బతుకుదెరువు కోసం 15 సంవత్సరాల క్రితం రెడ్డెమ్మ కువైట్‌కు వెళ్లింది.
ఇదే గ్రామానికి చెందిన రెడ్డప్ప నాయుడు కూడా కువైట్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో రెడ్డెప్పనాయుడితో రెడ్డమ్మకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని సన్నిహిత సంబంధంగా మార్చుకునేందుకు రెడ్డప్పనాయుడు పథకం వేశాడు. కువైట్‌లోనే ఉంటున్న తన బావమరిది మహేష్‌నాయుడుకు పథకాన్ని వివరించారు.
మరికొందరితో చర్చించి వ్యూహం పన్నారు. దీనికోసం చిట్వేల్‌కు చెందిన సుధారాణి అనే మహిళను ఎరగా ఎంచుకున్నారు. దీంతో ఆమె ఎల్లయ్యకు ఫోన్ చేసి తన దగ్గరకు పిలుపించుకునేది. ఈ నేపథ్యంలో ఎల్లయ్యతో పాటు మేహఃష్‌నాయుడు( కేవీపల్లె) శ్రీరాములు కురవపల్లె (ఫింఛా) మాతయ్య ( సానిపాయి) సుధారాణి డిసెంబర్ 25వ తేదీ రాత్రి సానిపాయి సమీపంలోని మామిడి తోటల్లోకి వెళ్లారు.
తనకు బీరు తాగే అలవాటు ఉందని సుధారాణి ఎల్లయ్యకు చెప్పడంతో సుండుపల్లె నుంచి మరో వ్యక్తితో బీరుతో పాటు మద్యం బాటిళ్లను కూడా తెప్పించారు. ఇద్దరు కలసి మద్యం బాగా తాగారు. కొద్దిసేపటికే ఎల్లయ్య మత్తులోకి జారుకున్నాడు. అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం ఎల్లయ్య ఊపిరి ఆడనీయకుండా చేసి ప్రాణాలు తీశారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు.