చెంబట్క పోవుడే..!
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పడకేసింది. మంజూరైన వాటిలో ఇప్పటి వరకు కనీసం సగం కూడా పూర్తికాలేదు. మొదట్లో నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులు.. ఇప్పుడు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు నిర్మాణం అంచనా వ్యయం పెరగనుందనే ప్రచారం జరుగుతుండడంతో పథకం ముందుకు సాగడంలేదు.
చొప్పదండి :
జిల్లాలో 2.20 లక్షల మందికి వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యూరుు. వీటిలో ఈ నెల రెండో వారం వ రకు కేవలం 72 వేల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యూరుు. మరో 30 వేలు పగతిలో ఉన్నారుు. ఇంకా 1.18 లక్షలు అసలే ప్రారంభం కాలేదు. పూర్తరుున వాటికి డబ్బులు మంజూరు చేసిన సంబంధిత శాఖ అధికారు లు.. పూర్తికాని విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా పథకంలో ఎలాం టి పురోగతి లభించడంలేదనే ఆరోపణలున్నారుు. గత యూపీఏ ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు కేటారుుంచిం ది. ఇందులో లబ్ధిదారుని వాటా రూ. 900 పోను ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 4,500, నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద లబ్ధిదారుడికి రూ. 4,600 అందించింది. ఎన్నిక ల ముందు ఉపాధి హామీ పథకం మొత్తాన్ని పెంచింది. కుటుంబంలో జాబ్‌కార్డు ఉంటే ఒక్కో లబ్ధిదారుడికి రోజుకు రూ.149 చొప్పున కూలీతో 35 రోజుల పనిదినాలు కల్పించి రూ. 5,275లు చెల్లించింది. పూర్తయిన నిర్మాణాలకు రంగులు అద్దేందుకు.. ఫొటో దిగేందుకు అదనంగా రూ. 125 చొప్పున కేటారుుంచింది.
నిలిచిన నిర్మాణాలు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పురోగతి సాధించడం లేదు. లబ్ధిదారులకు ఆసక్తి ఉన్నా.. పెరిగిన ధరలతో ప్రభుత్వ సాయం సరిపోవ డం లేదని పేదలు ముందుకు రావడం లేదు. ఎంత తక్కువ ఖర్చుతో నిర్మించినా రూ. 20 వేలకు పైగా అవుతున్నాయని పలువురు వాపోయారు. మంజూరైన పలువురు లబ్ధిదారులకు ఇంటి ఆవరణలో సరిపడా స్థలం లేక కూడా నిర్మాణాలు ప్రారంభించ లేదు. పలు మండలాలలో పావలావంతు కూడా పూర్తికాలేదు.
పెరగనున్న సాయం?
గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం కోసం ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనే సంకల్పంతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.15 వేల వరకు లబ్ధిదారులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చారుు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. కాగా పెంచే మొత్తంపై ఇప్పటి వరకు ఎలాంటి విధివిధానాలు ఖరాలుకాలేదు. అధికారులూ ఏమి చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే మంజూరై నిర్మాణం పూర్తిచేసుకున్న వారికి బిల్లు మంజూరు చేసిన అధికారులు.. మొన్నటి ఎన్నికల తర్వాత కొత్తగా ఎవరికీ వ్యక్తిగత మరుగుదొడ్డి మంజూరూ చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టే పథకంపై లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఇచ్చిన అనుమతులు పూర్తి చేసి.. కొత్తగా మంజూరు చేసే వాటికే కొత్త పథకం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని ఉపాధి హామీ సిబ్బంది అంటున్నారు. నిర్మల్ భారత్ అభియూన్ అమలుకు, ఉపాధి హామీ పథకంతో సంబందం లేకుండా చేస్తారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం రూపొందించే కొత్త పథకం అమలవుతుందా..? లేదా..? అమలైనా అది ఎప్పటి నుంచి అనే క్లారిటీపై అన్ని సందేహాలే ఉన్నారుు. అప్పటి వరకు ఈ పథకం ముందుకు సాగే అవకాశాలు ఎంత మాత్రం కనిపించడంలేదు.
ఎలాంటి ఉత్తర్వులు రాలేదు..
- లక్ష్మి, ఏపీవో
ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. డబ్బులు సరిపోవడం లేదని చాలామంది నిర్మాణాలు చేపట్టడంలేదు. మరికొందరు స్థలం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుకే పథకం వందశాతం పూర్తికావడం లేదు. మరుగుదొడ్లు అందరూ నిర్మించుకోవాలి. పారిశుధ్య పరిరక్షణకు తోడ్పడాలి.