అక్కరకురాని ‘రైతుబంధు'!
జడ్చర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న రైతుబంధు పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం ప్రచారానికే పరిమితమైందని రైతుల నుంచి విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నప్పుడు పంటలు అమ్ముకుని నష్టపోకుండా కొంతకాలం పాటు సరుకులను గోదాముల్లో నిల్వఉంచి ఆశిం చినధర పలికినప్పుడు అమ్ముకుని లాభం పొందాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. స్థానిక బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఓ రైతుకు అధికారులు చుక్కలుచూపారు.
మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్‌నాయక్ 86 బస్తాల మొక్కజొన్నను మూ డురోజుల కిందట బాదేపల్లి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అయితే మార్కెట్‌లో సరైన ధరలు లభించకపోవడంతో రైతుబంధు పథకాన్ని వినియోగించుకోవాలని భావించి మార్కెట్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రైతు తెచ్చిన ధాన్యాన్ని యార్డు ఆవరణలోని గోదాములో నిల్వఉంచి రైతుబంధు పథకం కింద రుణం ఇచ్చేం దుకు ధ్రువీకరణపత్రం కూడా రైతుకు అందజేశారు.
తనకు రుణం అందుతుందని, తన కుమారుడి చదువులకు అవసరమయ్యే రూ.60వేలు సర్దుబా టు అవుతాయని ఆశించాడు. తీరా రేపుమాపు అని మార్కెట్ అధికారులు కాలయాపన చేస్తుండడంతో దిక్కుమొహం వేసుకుని చూస్తున్నాడు. ఈ విషయాన్ని కొందరు రైతుసంఘం నేతలు మార్కెట్‌కమిటీ సహాయ కార్యదర్శి అబ్దుల్ సమీ దృష్టికి తీసుకెళ్లగా..రైతుబంధు పథకం కింద రుణం మంజూరుచేసేందుకు తమకు అధికారాలు లేవని స్పష్టంచేశారు.
రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం రుణం మంజూరుచేస్తామని యార్డు కార్యదర్శి అనంతయ్య వెల్లడించారు. రైతులకు సకాలంలో రుణం మంజూరుచేయకపోవడం దారుణమని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కరకల కృష్ణారెడ్డి తెలిపారు.
జాప్యం ఎక్కడంటే!
ధాన్యాన్ని భద్రపర్చుకున్న రైతుకు పంటఉత్పత్తి మార్కెట్ విలువను బట్టి 75శాతం రుణం రుపేణా ఇవ్వాలి. ఈ డబ్బుకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. మళ్లీ ఆశించినధరకు అమ్ముకుడుపోయిన తరువాత సదరు రైతు తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే రుణం ఇచ్చేందుకు మొద ట మార్కెట్‌శాఖ జిల్లాస్థాయి ఉన్నతాధికారి ధ్రువీకరించాలి. ఆ తరువాత సంబంధిత మార్కెట్‌యార్డు కార్యదర్శి సమ్మతిస్తే రుణం తీసుకోవచ్చు. బాదేపల్లి మార్కెట్‌లో రైతుబంధు పథకం కింద రైతు లక్ష్మణ్‌నాయక్‌కు రుణం ఇచ్చేందుకు ఉన్నతాధికారులు తాత్సారం వహిస్తున్నారు.
జిల్లాలో ఇలా..
మొక్కజొన్న పంట దిగుబడులు ఇప్పుడిప్పుడే రైతుల చేతికొస్తున్నాయి. బాదేపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ మార్కెట్‌లో విక్రయాలు ఊపందుకున్నా యి. బాదేపల్లి మార్కెట్‌లో శనివారం ఒకేరోజు సుమారు 60వేల క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ మద్దతుధర రూ.1310 కాగా, రైతులకు ఎక్కడా దరిదాపుల్లోకి కూడా ఇవ్వడం లేదు. కనిష్టంగా రూ.800, గరిష్టంగా రూ.1040 ధర చెల్లిస్తున్నారు. జిల్లాలోని అన్ని మార్కెట్లలో దాదాపు ఇదేధర అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్న రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకుంటు న్నా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కలెక్టర్ స్పందించి రైతుబంధు పథకం అమలయ్యేలా చూడాలన్నారు.