రుణమాఫీ ప్రశ్నార్థకం
చెన్నారెడ్డిపల్లి(పొదలకూరు) : రైతుల రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారిందని, మాఫీ నుంచి ఉద్యాన పంటలను తొల గించడం దారుణమని ైసర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నావూరు, చెన్నారెడ్డిపల్లిలో శనివారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో కాకాణి మాట్లాడుతూ రుణమాఫీపై ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతుందన్నారు. మెట్ట పంటల సాగుకు పంట రుణాలు తీసుకునే సమయంల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు బ్యాంకరు చూపడంతో రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోతుందన్నారు. బ్యాంకర్ల తప్పిదానికి రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు.
మెట్ట రైతులకు రుణమాఫీని వర్తింప చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని నిబంధనలను సడలిచాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కార్యక్రమానికి తాను వ్యతిరేకం కాదని, గ్రామసభల్లో వాస్తవ పరిస్థితులను మాట్లాడుతున్నానన్నారు. స్వచ్ఛాంధ్ర అంటున్న ప్రభుత్వం ముందుగా చెత్తను డంపింగ్ యా ర్డులకు తరలించేందుకు పంచాయతీలకు వాహనాలను పంపిణీ చేయాలన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా, నిధులను విడుదల చేయకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే అభాసుపాలు అవుతాయన్నారు.
వృద్ధులకు భరోసా అంటూ పింఛన్లు పంపిణీ చేస్తున్నా అర్హులకు పొలాలు ఉన్నాయని తొలగిస్తున్నారని తెలి పారు. జిల్లాలో 54 వేల పింఛన్లను తొలగించగా, సర్వేపల్లి నియోజకవర్గంలో 5 వేల పింఛన్లను తొలగించారన్నారు. నిరంతరం పొలంలో ఉండే రైతులను పొలం పిలవాల్సిన పనిలేదని, వారి రుణాలను మాఫీ చేస్తే చాలు అన్నారు. డ్వామా పీడీ, మండల ప్రత్యేకాధికారిణి గౌతమి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.శ్రీహరి, తహశీల్దార్ వి.కృష్ణారావు, నావూరు, చెన్నారెడ్డిపల్లి సర్పంచ్‌లు బొడ్డు జయమ్మ, వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కోడూరు విజయమ్మ, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి, నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోడూరు ఆనంద్‌రెడ్డి, బొడ్డు నరసింహులు, నోటి బాలకొండారెడ్డి పాల్గొన్నారు