questionable
-
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
అక్కరకురాని ‘రైతుబంధు'!
జడ్చర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావి స్తున్న రైతుబంధు పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం ప్రచారానికే పరిమితమైందని రైతుల నుంచి విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు పంటలు అమ్ముకుని నష్టపోకుండా కొంతకాలం పాటు సరుకులను గోదాముల్లో నిల్వఉంచి ఆశిం చినధర పలికినప్పుడు అమ్ముకుని లాభం పొందాలనే ప్రభుత్వం ఆశయం నీరుగారుతోంది. స్థానిక బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఓ రైతుకు అధికారులు చుక్కలుచూపారు. మండలంలోని చిట్టెబోయిన్‌పల్లి తండాకు చెందిన ముడావత్ లక్ష్మణ్‌నాయక్ 86 బస్తాల మొక్కజొన్నను మూ డురోజుల కిందట బాదేపల్లి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. అయితే మార్కెట్లో సరైన ధరలు లభించకపోవడంతో రైతుబంధు పథకాన్ని వినియోగించుకోవాలని భావించి మార్కెట్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. రైతు తెచ్చిన ధాన్యాన్ని యార్డు ఆవరణలోని గోదాములో నిల్వఉంచి రైతుబంధు పథకం కింద రుణం ఇచ్చేం దుకు ధ్రువీకరణపత్రం కూడా రైతుకు అందజేశారు. తనకు రుణం అందుతుందని, తన కుమారుడి చదువులకు అవసరమయ్యే రూ.60వేలు సర్దుబా టు అవుతాయని ఆశించాడు. తీరా రేపుమాపు అని మార్కెట్ అధికారులు కాలయాపన చేస్తుండడంతో దిక్కుమొహం వేసుకుని చూస్తున్నాడు. ఈ విషయాన్ని కొందరు రైతుసంఘం నేతలు మార్కెట్‌కమిటీ సహాయ కార్యదర్శి అబ్దుల్ సమీ దృష్టికి తీసుకెళ్లగా..రైతుబంధు పథకం కింద రుణం మంజూరుచేసేందుకు తమకు అధికారాలు లేవని స్పష్టంచేశారు. రైతుబంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం రుణం మంజూరుచేస్తామని యార్డు కార్యదర్శి అనంతయ్య వెల్లడించారు. రైతులకు సకాలంలో రుణం మంజూరుచేయకపోవడం దారుణమని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు కరకల కృష్ణారెడ్డి తెలిపారు. జాప్యం ఎక్కడంటే! ధాన్యాన్ని భద్రపర్చుకున్న రైతుకు పంటఉత్పత్తి మార్కెట్ విలువను బట్టి 75శాతం రుణం రుపేణా ఇవ్వాలి. ఈ డబ్బుకు 180 రోజుల వరకు ఎలాంటి వడ్డీ ఉండదు. మళ్లీ ఆశించినధరకు అమ్ముకుడుపోయిన తరువాత సదరు రైతు తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే రుణం ఇచ్చేందుకు మొద ట మార్కెట్‌శాఖ జిల్లాస్థాయి ఉన్నతాధికారి ధ్రువీకరించాలి. ఆ తరువాత సంబంధిత మార్కెట్‌యార్డు కార్యదర్శి సమ్మతిస్తే రుణం తీసుకోవచ్చు. బాదేపల్లి మార్కెట్లో రైతుబంధు పథకం కింద రైతు లక్ష్మణ్‌నాయక్‌కు రుణం ఇచ్చేందుకు ఉన్నతాధికారులు తాత్సారం వహిస్తున్నారు. జిల్లాలో ఇలా.. మొక్కజొన్న పంట దిగుబడులు ఇప్పుడిప్పుడే రైతుల చేతికొస్తున్నాయి. బాదేపల్లి, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ మార్కెట్లో విక్రయాలు ఊపందుకున్నా యి. బాదేపల్లి మార్కెట్లో శనివారం ఒకేరోజు సుమారు 60వేల క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయాలు జరిగాయి. ప్రభుత్వ మద్దతుధర రూ.1310 కాగా, రైతులకు ఎక్కడా దరిదాపుల్లోకి కూడా ఇవ్వడం లేదు. కనిష్టంగా రూ.800, గరిష్టంగా రూ.1040 ధర చెల్లిస్తున్నారు. జిల్లాలోని అన్ని మార్కెట్లలో దాదాపు ఇదేధర అమలవుతోంది. ఈ పరిస్థితుల్లో గిట్టుబాటు ధర కోసం వేచిచూస్తున్న రైతులు రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకుంటు న్నా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. కలెక్టర్ స్పందించి రైతుబంధు పథకం అమలయ్యేలా చూడాలన్నారు. -
రుణమాఫీ ప్రశ్నార్థకం
చెన్నారెడ్డిపల్లి(పొదలకూరు) : రైతుల రుణమాఫీ ప్రశ్నార్థకంగా మారిందని, మాఫీ నుంచి ఉద్యాన పంటలను తొల గించడం దారుణమని ైసర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని నావూరు, చెన్నారెడ్డిపల్లిలో శనివారం జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో కాకాణి మాట్లాడుతూ రుణమాఫీపై ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతుందన్నారు. మెట్ట పంటల సాగుకు పంట రుణాలు తీసుకునే సమయంల్లో నిమ్మ సాగు చేస్తున్నట్టు బ్యాంకరు చూపడంతో రైతులకు రుణమాఫీ వర్తించకుండా పోతుందన్నారు. బ్యాంకర్ల తప్పిదానికి రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. మెట్ట రైతులకు రుణమాఫీని వర్తింప చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానన్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని నిబంధనలను సడలిచాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కార్యక్రమానికి తాను వ్యతిరేకం కాదని, గ్రామసభల్లో వాస్తవ పరిస్థితులను మాట్లాడుతున్నానన్నారు. స్వచ్ఛాంధ్ర అంటున్న ప్రభుత్వం ముందుగా చెత్తను డంపింగ్ యా ర్డులకు తరలించేందుకు పంచాయతీలకు వాహనాలను పంపిణీ చేయాలన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా, నిధులను విడుదల చేయకుండా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే అభాసుపాలు అవుతాయన్నారు. వృద్ధులకు భరోసా అంటూ పింఛన్లు పంపిణీ చేస్తున్నా అర్హులకు పొలాలు ఉన్నాయని తొలగిస్తున్నారని తెలి పారు. జిల్లాలో 54 వేల పింఛన్లను తొలగించగా, సర్వేపల్లి నియోజకవర్గంలో 5 వేల పింఛన్లను తొలగించారన్నారు. నిరంతరం పొలంలో ఉండే రైతులను పొలం పిలవాల్సిన పనిలేదని, వారి రుణాలను మాఫీ చేస్తే చాలు అన్నారు. డ్వామా పీడీ, మండల ప్రత్యేకాధికారిణి గౌతమి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.శ్రీహరి, తహశీల్దార్ వి.కృష్ణారావు, నావూరు, చెన్నారెడ్డిపల్లి సర్పంచ్‌లు బొడ్డు జయమ్మ, వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కోడూరు విజయమ్మ, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి, నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, కోడూరు ఆనంద్‌రెడ్డి, బొడ్డు నరసింహులు, నోటి బాలకొండారెడ్డి పాల్గొన్నారు