అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళిలా ఉంటుందని అన్నారు.
అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
గత రామ నవమికి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం!
Comments
Please login to add a commentAdd a comment