pratista
-
22న మరో రామాలయంలోనూ ప్రాణప్రతిష్ఠ
ఈ నెల 22న అయోధ్యలోని రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయితే అదేసమయంలో మధ్యప్రదేశ్లోని సౌసర్ నగర్లో గల 200 ఏళ్ల పురాతన రామాలయంలోనూ శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఆలయ కమిటీ జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో భారీ ఆలయాన్ని నిర్మించి, అందులో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని, అదే సమయంలో తాము కూడా ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపనకు నిర్ణయం తీసుకున్నప్పుడు, తాము కూడా అదే రోజున ఈ ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించామన్నారు. కమిటీ మేనేజర్ నరేష్ బగానీ మాట్లాడుతూ దాదాపు 200 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి తమ కుటుంబసభ్యులు శ్రీరామ మందిరాన్ని నిర్మించినప్పుడు ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఆలయాన్ని పునరుద్ధరించాలని తమ కుటుంబీకులు నిర్ణయించారని, గత రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు కొనసాగాయన్నారు. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 22 నుంచి ఆలయం భక్తులకు అందుబాటులోకి రానున్నదని అన్నారు. -
నేడు ఆలయ ప్రాంగణంలోకి బాలరాముని విగ్రహం!
ఈ నెల 22న జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ప్రాయశ్చిత్త పూజలతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా ప్రాయశ్చిత్త పూజలను నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. అనంతరం డాక్టర్ అనిల్ మిశ్రా సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. తరువాత విగ్రహ నిర్మాణ స్థలంలోనూ పూజలు చేశారు. బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేస్తూ, కళ్లకు గంతలు కట్టారు. వీటిని జనవరి 22న తెరవనున్నారు. వివేక్ సృష్టి ప్రాంగణంలో ఆచార్య అరుణ్ దీక్షిత్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రాయశ్చిత్త పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పూజలు ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో శిల్పి అరుణ్ యోగిరాజ్ కూడా పాల్గొన్నారు. ప్రాయశ్చిత్త పూజలో భగవంతుడిని క్షమాపణలు కోరారు. విగ్రహ తయారీలో ఉలి, సుత్తి లేదా మరేదైనా పరికరాన్ని ఉపయోగించినందున భగవంతునికి గాయం తగిలిందన్న భావనతో ఈ విధమైన క్షమాపణలు కోరారు.. అనంతరం ప్రధాన అతిథి డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు సరయూ తీరానికి చేరుకుని దశవిధ స్నానం చేశారు. ఈ సమయంలో ప్రాయశ్చిత్త పూజలకు సంబంధించిన మంత్రోచ్ఛారణలు ప్రతిధ్వనించాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని అయోధ్య ఆలయ ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించిన యాగ మండపంలో పూజలు ప్రారంభమవుతాయి. ఇది కూడా చదవండి: అయోధ్యలో సంప్రదాయ క్రతువులు ఆరంభం -
అయోధ్యలో ప్రతీయేటా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం
అయోధ్యలో ఈనెల 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపధ్యంలో మున్ముందు అయోధ్యలో అనేక అభివృద్ధి పనులు జరగనున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విలేకరుల సమక్షంలో అయోధ్యలో అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయోధ్యలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తామని, దానిలో శాకాహారం అందిస్తామని యూపీ సీఎం యోగి తెలిపారు. అలాగే ప్రతీయేటా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఉత్సవం నిర్వహిస్తామని అన్నారు. ఎప్పుడో పదేళ్ల క్రితమే జరగాల్సిన ఉత్సవం ఇప్పుడు జరుగుతోందని అన్నారు. ఈ నెల 22న అయోధ్యలో జరిగే ఉత్సవం వెలుగుల పండుగ దీపావళిలా ఉంటుందని అన్నారు. అయోధ్యలో హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి 25కు పైగా ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వాటిలో ఒకటి కేవలం శాకాహారం అందించే సెవెన్ స్టార్ హోటల్ అని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై స్థానిక అధికారులతో చర్చించామని అన్నారు. అయోధ్యకు దేశంలోని నలుమూలల నుంచి రోడ్డు, విమాన, రైలు కనెక్టివిటీ ఏర్పడిందన్నారు. వీధి వ్యాపారుల వ్యాపార నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అయోధ్యలో గ్రీన్ కారిడార్ నిర్మిస్తామని, రామభక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత రామ నవమికి ఐదు లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేయగా, ఆ సంఖ్య 35 లక్షలు దాటిందని ముఖ్యమంత్రి తెలిపారు. అయోధ్యకు వచ్చే రామభక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి ప్రధాని నరేంద్ర మోదీ నామకరణం! -
ఆ ఐదుగురు.. ‘ప్రాణ ప్రతిష్ఠ’ ప్రధాన అతిథులు!
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముడు ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అయోధ్యలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆచార్యులు, అతిథుల ఫైనల్ జాబితాను ఖరారు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా హాజరుకానుండగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న దేశ, ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించింది. దీని ప్రకారం జనవరి 14 నుంచి 22 వరకు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 22న వివిధ దేవాలయాలలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులు రామ జ్యోతులు వెలిగించనున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మ గణేశ్వర శాస్త్రి, ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారధ్యంలో జరగనుంది. వీరితో పాటు సునీల్ దీక్షిత్, గజానంద్ జోగ్కర్, అనుపమ్ దీక్షిత్, ఘాటే గురూజీలు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు? -
శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారయ్యింది. 2024, జనవరి 22న అభిజీత్ లగ్నం, మృగశిర నక్షత్రంలో మధ్యాహ్నం 12:20 గంటలకు శ్రీరాముని విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు ఆదివారం సాకేత్ నిలయంలో సంఘ్ పరివార్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేడుకల ప్రచారాన్ని నాలుగు దశలుగా విభజించి నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఇది డిసెంబర్ 20 వరకు కొనసాగనుంది. దీనిలో ఆరోజు నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళిక రూపురేఖలను సిద్ధం చేయనున్నారు. అలాగే స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా, బ్లాక్ స్థాయిలో పది మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో దశలో డోర్ టు డోర్ కాంటాక్ట్ స్కీమ్ కింద 10 కోట్ల కుటుంబాలకు అక్షతలు, రాంలాల చిత్రం, కరపత్రం అందజేయనున్నారు. జనవరి 22న మొదలయ్యే మూడో దశలో దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. నాలుగో దశలో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు శ్రీరాముని దర్శనభాగ్యం కలగనుంది. ఈ నాలుగో దశ గణతంత్ర దినోత్సవం నుండి ప్రారంభమై ఫిబ్రవరి 22 వరకు కొనసాగనుంది. నవంబర్ 20న భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేపట్టనున్నారు. ఈ మార్గంలోని రోడ్లు, కూడళ్లకు మరమ్మతులు చేస్తున్నారు. తాత్కాలిక బస్టాండ్ నిర్మించారు. మఠాలు, ఆలయాలను అలంకరించారు. లక్నో నుండి వచ్చే భక్తులు సహదత్గంజ్ పరిక్రమ మార్గంలో ఫైజాబాద్ బస్సు స్టేషన్కు చేరుకుంటారు. రైలులో వచ్చే వారు అయోధ్య కాంట్కు చేరుకుంటారు. ఇక్కడి నుండి వారు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఈ ప్రదక్షిణల కార్యక్రమం నవంబర్ 21వ తేదీ రాత్రి 11:38 గంటలకు ముగియనుంది. ఇది కూడా చదవండి: విశ్వసుందరి పలాసియోస్ -
వైభవంగా అభయాంజనేయస్వామి విగ్రష ప్రతిష్ఠాపన
సిరిసిల్ల టౌన్ : స్థానిక శ్రీశివసాయి బాబా ఆలయ ఆవరణలో ఇటీవల నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా సాగుతున్న వేడుకల్లో భాగంగా ఉదయం 8గంటల నుంచి శ్రీశైవమహా పీఠాధిపతి అత్తలూరి మృత్యుంజయశర్మ, ముదిగొండ అమరనాథశర్మలు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం 1గంటకు మహాన్నదానం చేపట్టారు.