అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న బాలరాముడు ప్రతిష్ఠితుడు కానున్నాడు. ఈ నేపధ్యంలో ఇప్పటికే అయోధ్యలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే ఆచార్యులు, అతిథుల ఫైనల్ జాబితాను ఖరారు చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాన అతిథిగా హాజరుకానుండగా, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి, ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరు గర్భాలయంలో జరిగే పూజలలో పాల్గొననున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 22 న దేశ, ప్రపంచవ్యాప్తంగా రామభక్తుల కోసం నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందించింది. దీని ప్రకారం జనవరి 14 నుంచి 22 వరకు దేవాలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జనవరి 22న వివిధ దేవాలయాలలో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం భక్తులు రామ జ్యోతులు వెలిగించనున్నారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం బ్రహ్మ గణేశ్వర శాస్త్రి, ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ సారధ్యంలో జరగనుంది. వీరితో పాటు సునీల్ దీక్షిత్, గజానంద్ జోగ్కర్, అనుపమ్ దీక్షిత్, ఘాటే గురూజీలు కూడా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?
Comments
Please login to add a commentAdd a comment