శ్రీశైలంలో శివ చతుస్సప్తాహ భజనలు ప్రారంభం | shiva pujas at srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో శివ చతుస్సప్తాహ భజనలు ప్రారంభం

Aug 4 2016 12:57 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం శ్రావణ మాసారంభం సందర్భంగా శివచతుస్సప్తాహ భజనలను శాస్త్రోక్త పూజలతో ప్రారంభించారు.

శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయ ప్రాంగణంలో బుధవారం శ్రావణ మాసారంభం  సందర్భంగా  శివచతుస్సప్తాహ భజనలను శాస్త్రోక్త పూజలతో ప్రారంభించారు. లోకకల్యాణం కోసం ప్రతి ఏటా శ్రావణమాసంలో ఈ అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా ఆలయ ప్రాంగణంలోని వీరశిరోమండపంలో అఖండ శివసప్తాహం నిర్విఘ్నంగా జరగాలని ఈవో నారాయణభరత్‌గుప్త, అర్చకులు,వేదపండితులు  మహాగణపతి పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండి శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలని మహాసంకల్పాన్ని చెప్పారు. అనంతరం చండీశ్వరపూజ, కలశస్థాపన, కంకణపూజ, కంకణధారణ, దీక్షాధారణ కార్యక్రమాలతో భజన ప్రారంభించారు. బుధవారం  నుంచి ప్రారంభమైన ఈ శివసప్తాహంలో  కర్నూలు సుంకులాంబదేవి భజన బందం,  శ్రీరామాంజనేయ భజన బందం,  చెన్నకేశవ నాటక కళామండలి, పూర్ణాహుతి వరకు గురునిమిషాంబాదేవి భజన మండలి, యమ్‌ మల్లికార్జునస్వామి, గోపనదేవరహళ్లి బందాలు పాల్గొంటాయి.  ఈ మాసమంతా ప్రతిరోజు రాత్రింబవళ్లు నిరంతరంగా వీరు ఓంనమఃశివాయ పంచాక్షరి ప్రణవ భజనలు చేస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement