శ్రీశైలాలయ పూజా వేళల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ దర్శనభాగ్యం కల్పించేందుకు అధికారులు ఆలయ పూజా వేళల్లో మార్పు చేశారు. ఆదివారం వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహామంగళహారతి, 5.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి.