మల్లన్న వైభవం
మల్లన్న వైభవం
Published Mon, Oct 24 2016 10:31 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో స్వామిఅమ్మవార్లు వెండిరథంపై దర్శనమిచ్చారు. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం కావడంతో రాత్రి వెండిరథంపై ఉత్సవమూర్తులను ఆధిష్టింపజేసి విశేషపూజలను నిర్వహించి ఆలయప్రదక్షిణ చేయించారు. కార్యక్రమానికి ముందుగా ఉత్సవమూర్తులను సహస్రదీపాలంకరణ మండపంలో ఽఉంచి ప్రత్యేకపూజలను వేదమంత్రోచ్చరణల మధ్య శాస్త్రోక్తకంగా అర్చకులు నిర్వహించారు. కళారాధనలో భాగంగా అక్కమహదేవి అలంకార మండపంలో హరికథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
- శ్రీశైలం
Advertisement
Advertisement