శ్రీశైలాలయ పూజా వేలల్లో మార్పు
శ్రీశైలాలయ పూజా వేలల్లో మార్పు
Published Wed, Oct 19 2016 11:50 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికి దర్శనభాగ్యం కల్పించడానికి అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పు చేశారు. గురువారం వేకువజామున 4.30గంటలకు మంగళవాయిద్యాలు, 5గంటలకు సుప్రభాతం, 6గంటలకు మహా మంగళహారతి, 6.30 నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి.
Advertisement
Advertisement