timing
-
నిన్నటి పేపర్ అలాగే ఉండటంతో అనుమానం..
సాక్షి, న్యూఢిల్లీ : సమయ స్ఫూర్తి కలిగిన వారు జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎదుటి వారి జీవితాలను రక్షించి ప్రశంసలు అందకుంటారని దక్షిణ ఇంగ్లండ్‌లోని డార్సెట్ నగరానికి చెందిన 15 ఏళ్ల నవోమీ జుప్ అనే బాలిక నిరూపించారు. బతుకుతెరవు కోసం గత రెండేళ్లుగా ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్ వేస్తున్న ఆ బాలిక రోజూలాగే ఈ నెల 15వ తేదీన కూడా క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలో ఇంటింటికి పేపర్ వేస్తూ వెళ్లింది. ఓ ఇంటి వద్ద పేపర్ బాక్సులో పేపర్ వేయబోతుండగా, అంతకుముందు రోజు పేపర్ కూడా కనిపించింది. ఆ ఇంటిలో ఉంటున్న వారెవరో పేపర్ కోసం బయటకు రాలేక పోయారని ఆమెకు అర్థం అయింది. వెంటనే ఆ బాలిక 101కు ఫోన్‌చేసి పోలీసులకు ఈ విషయం చెప్పింది. అనారోగ్యం లేదా మరో కారణం వల్లనో ఆ ఇంట్లోని వారు బయటకు రాలేకపోయి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. (చదవండి: వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్) పోలీసులు హుటాహుటిన వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లగా ఓ మంచం మీద అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వద్ధుడు కనిపించారు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఆ వద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లో ప్రభుత్వ పింఛనుదారుడు ఒక్కరే నివసిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని బుధవారం నాడే ఇంటికి చేరుకున్నారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిండు ప్రాణాలను రక్షించినందుకు ఆ ప్రాంతం పోలీసు అధికారి ఆమెను ప్రశంసిస్తూ ‘ప్రత్యేక గుర్తింపు పత్రం’తో సత్కరించారు. లాక్డౌన్లో కూడా పేపర్ ఆపకుండా తన విధులను సక్రమంగా నిర్వహించిందంటూ ఆ ప్రాంతం వాసులు కూడా ఆమెను ప్రశంసించారు. (చదవండి: రాబిన్ హుడ్ అవతారమెత్తిన డీజీపీ ) -
8 నిమిషాలు! సిటీ పోలీసు రెస్పాన్స్ టైమ్ ఇదీ
సాక్షి, సిటీబ్యూరో: ఓ నేరం బారినపడిన, సహాయం అవసరమైన వ్యక్తి నుంచి పోలీసులకు ఫోల్ కాల్ వచ్చినప్పుడు ఎంత తొందరగా వారి వద్దకు చేరుకోగలిగితే... అంత తక్కువ నష్టం, ఎక్కువ మేలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘పోలీస్ రెస్పాన్స్ టైమ్’ అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం... వీలైనంత తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరుకోవడం... నేరాలు చోటు చేసుకునే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ జరిగేలా చూడటం... ఈ లక్ష్యాలే ప్రధాన అజెండాగా రక్షక్, బ్లూకోల్ట్స్లకు ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ నిర్థారిస్తున్నారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్–100’తో అనుసంధానించారు. నగరంలో మొదటి ఆరు నెలలకు సంబంధించి ఈ రెస్పాన్స్ టైమ్ సగటున ఎనిమిది నిమిషాలుగా ఉంది. టాప్‌టెన్ ఠాణాల్లో ఉన్న పంజగుట్ట 3.26 నిమిషాలు, నారాయణగూడ 3.39 నిమిషాలు, అబిడ్స్ పోలీసులు 3.57 నిమిషాలుగా నమోదైంది. ఒకప్పుడు ఇలా... నగరంలోని బాధితుడెవరైనా సహాయం కోసం ‘100’కు ఫోన్ చేస్తే... అది నేరుగా ఈఎంఆర్ఐ ఆధీనంలో ఉన్న ‘డయల్–100’కు చేరుకునేది. అక్కడి సిబ్బంది విషయం తెలుసుకుని.. బాధితుడు ఏ ఠాణా పరిధిలోకి వస్తాడో వాకబు చేసేవారు. ఆ తర్వాత సదరు ఫోన్ కాల్లోని అంశాలను టెక్టŠస్‌గా మార్చి బాధితుడున్న ప్రాంతం పరిధిలోకి వచ్చే ఠాణాతో పాటు జోన్ కార్యాలయం, కమిషనరేట్‌కు చెందిన ప్రధాన కంట్రోల్ రూమ్‌లోని కంప్యూటర్లకు పంపేవారు. దీంతోపాటు వాకీటాకీ ద్వారానూ సందేశం ఇవ్వడం ద్వారా గస్తీ వాహనాలను అప్రమత్తం చేసేవారు. ఈ సమాచారం అందుకునే గస్తీ సిబ్బంది ఎక్కడ ఉన్నారు? బాధితుడికి ఎంత దూరంలో ఉన్నారు? తదితర అంశాలు తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. దీంతో ఆయా గస్తీ వాహనాల్లోని సిబ్బంది చెప్పిన అంశాల పైనే ఆధారపడాల్సి వచ్చేది. ఫలితంగా గస్తీ వాహనం బాధితుడి వద్దకు చేరే సమయం చాలా ఎక్కువగా ఉండేది. కొన్నిసార్లు అరగంట, గంట కూడా పట్టేది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో పాటు నేరస్తులు తప్పించుకునేవారు. ‘100’ కార్యకలాపాలు హైటెక్‌గా... గస్తీ సిబ్బందికి సైతం ట్యాబ్స్ అందించారు. వీటి ఆధారంగా ‘డయల్–100’ను గస్తీ వాహనాలతో అనుసంధానించారు. ఫలితంగా రెస్పాన్స్టైమ్ గణనీయంగా తగ్గడం తోపాటు సాంకేతికత పెరిగింది. ప్రస్తుతం ఇలా... ♦ ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు ‘100’కు ఫోన్ చేసి సçహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ♦ ప్రతి గస్తీ వాహనంలో ఉన్న ట్యాబ్‌లోని జీపీఎస్ ఆధారంగా ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఏ ప్రాంతంలో ఉందో కంప్యూటర్ తెర ద్వారా కచ్చితంగా తెలుస్తోంది. ♦ దీంతో బాధితుడు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ ఫోన్‌కా ల్ను మళ్లిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం కేవలం కొన్ని సెకన్లలో పూర్తవుతుంది. ♦ పెట్రోలింగ్ వాహనాల్లో ఉండే సిబ్బంది ఫోన్లకు ‘100’ నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే... ప్రత్యేక రింగ్‌టోన్ వస్తుంది. ఫోన్ ఎక్కడి నుంచి అనేది తేలిగ్గా తెలియడం కోసం అన్ని వాహనాల్లోని సిబ్బందికీ ఇలాంటి టోన్ ఏర్పాటు చేశారు. ♦ ఫోన్ ఎత్తిన వెంటనే అతడి ట్యాబ్ తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితుడు/ఫిర్యాదుదారుడికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నది కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’ అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్ చేస్తారు. ♦ ఒకసారి ఎక్నాలెడ్జ్ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్ టైమ్’ లెక్కింపు ప్రారంభమవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకునే గస్తీ వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తున్నాయి. ♦ ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే క్షతగాత్రుల కు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు మొత్తం వ్యవహారాన్ని ఆధారాల కోసం ఫొటోలు తీసుకుంటున్నారు. ♦ పబ్లిక్ ప్లేసుల్లో జరిగే గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదుపై స్థానిక పోలీసు అధికారుల్ని అప్రతమత్తం చేయడంతో పాటు ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు చేపడుతున్నారు. ♦ సహాయక చర్యలు, తదుపరి యాక్షన్స్ తీసుకోవడం పూర్తయిన వెంటనే సదరు ఫొటో లు, వీడియోలను ఆన్లైన్ ద్వారానే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు పంపిస్తారు. ♦ ఈ తంతంగాలన్నీ పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’ బటన్ నొక్కడంతో ‘రెస్పాన్స్ టైమ్’ పూర్తవుతుంది. ♦ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి ఆద్యంతం జరిగే ప్రతి అంకం ‘డయల్–100’తో పాటు కమిషనరేట్ కంట్రోల్ రూమ్, జోనల్ కార్యాలయాలకు చేరుతాయి. కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించిగస్తీ వాహనాలు ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడానికీ, ‘కాల్ క్లోజ్డ్’ బటన్ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు. ♦ ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్ టైమ్’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరిని తీసుకుంటూ ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ను నిర్థారిస్తున్నారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క. ♦ రెస్పాన్స్ టైమ్ ఎక్కువగా తీసుకున్న వాహనాల్లోని సిబ్బందిని జవాబుదారీ చేస్తున్నారు. ఆలస్యానికి కారణం ఏంట న్నది తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ‘రెస్పాన్స్’లో టాప్‌టెన్ ఠాణాలివీ.. పోలీసుస్టేషన్ రెస్పాన్స్ టైమ్ పంజగుట్ట 3.26 నిమిషాలు నారాయణగూడ 3.39 నిమిషాలు అబిడ్స్ 3.57 నిమిషాలు ఫలక్‌నుమ 4.04 నిమిషాలు ఛత్రినాక 4.12 నిమిషాలు బంజారాహిల్స్ 4.47 నిమిషాలు ఎస్సార్‌నగర్ 5.51 నిమిషాలు గాంధీనగర్ 6.46 నిమిషాలు కంచన్‌బాగ్ 7.29 నిమిషాలు బేగంపేట 7.44 నిమిషాలు సిటీ యావరేజ్ 8 నిమిషాలు -
పాఠశాల వేళల్లో మార్పు
ప్రాథమిక స్కూళ్లలో 8 నుంచి 12.30 గంటల వరకు తరగతులు – మద్యాధ్యాహ్నం పరీక్షల నిర్వహణ – ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు స్టడీ అవర్స్ – 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు – ‘సాక్షి’ కథనాని స్పందన కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమన్యాల కింద నడుస్తున్న పాఠశాలల వేళల్లో మార్పు చేశారు. ఈ మేరకు జిల్లా కామన్ పరీక్షల బోర్డు చైర్మన్, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13 నుంచి స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 14 నుంచి సమ్మెటివ్–3 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో తికమక నెలకొందని ఈ నెల 10న ‘గందరగోళం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి పరీక్షలకు, విద్యార్థుల తరగతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వేళల్లో కొంత మార్పు చేశారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో టీచర్లను సైతం ఉదయం తరగతులకు సగం మంది, మధ్యాహ్నం పరీక్షలకు సగం మంది టీచర్లు హాజరు కావాలని డీఈఓ సూచించారు. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 12 గంటల నుంచి స్టడీ ఆవర్స్ నిర్వహించి, 2 నుంచి 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే హెచ్‌ఎంలదే భాద్యత సమ్మెటివ్–3 పరీక్షలు మంగళవారం నుంచి మొదలయ్యాయి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజు ఉండే పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యాశాఖ కార్యాలయం నుంచి 12 గంటలకు తీసుకుపోయి 2 గంటలకు పరీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించాలని, ఎక్కడైనా మాస్ కాపీయింగ్, ప్రశ్నపత్రాలు లీకేజీ అయితే ఆయా స్కూళ్ల హెచ్ఎంలే బాధ్యత వహించాలన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత 8, 9 తరగతులకు సంబంధించిన సమాధాన పత్రాల బండిళ్లను 100 శాతం బహిరంగా ముల్యాంకనానికి విద్యార్థుల పూర్తి వివరాలు తెలుపూ నమునాను జత పరిచి సంబంధిత ఎంఈఓ కార్యాలయాలకు భద్రతతో అందజేయాలన్నారు. -
శ్రీశైలాలయ పూజా వేలల్లో మార్పు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికి దర్శనభాగ్యం కల్పించడానికి అధికారులు ఆలయ పూజావేళల్లో మార్పు చేశారు. గురువారం వేకువజామున 4.30గంటలకు మంగళవాయిద్యాలు, 5గంటలకు సుప్రభాతం, 6గంటలకు మహా మంగళహారతి, 6.30 నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. సాయంత్రం 6గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు తిరిగి ప్రారంభమవుతాయి. -
పలు రైళ్ల వేళల్లో మార్పులు
కర్నూలు(రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న పలు రైళ్లు వేళల్లో మార్పులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నుంచి సికింద్రాబాదుకు వరకు ప్రతి రోజు నడుస్తున్న హంద్రీ (ఇంటర్ సిటీ) ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17223) సికింద్రాబాదులో ఇకపై సాయంత్రం 4:45కి బయలుదేరనుంది. కాచిగూడలో 5:10కి బయలుదేరి కర్నూలుకు రాత్రి 9:35 గంటలకు చేరనుంది. కాచిగూడా నుంచి చెన్నై వరకు నడిచే చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17652)ను తమిళనాడులోని తంబరం, చెంగల్పట్టు వరకు పొడగించారు. కర్నూలులో రాత్రి 8:08కి వచ్చి 8:10కి బయలుదేరే ఈ రైలు చెన్నైకు ఉదయం 7:25 గంటలకు, చెంగల్పట్టుకు ఉదయం 9:10 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి 17651 నంబరు రైలు మధ్యాహ్నం 3:20గంటలకు, చెన్నై నుంచి 5గంటలకు కర్నూలుకు మరుసటి రోజు తెల్లవారుజామున 03:33గంటలకు చేరి 03:35గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడకు ఉదయం 7:55గంటలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి కర్నూలు వరకు నడుస్తున్న డెమో (నంబరు 77695) రైలు నంద్యాలలో ఉదయం 6:15 గంటలకు బయలుదేరి కర్నూలుకు 10:20 గంటలకు చేరుతుంది. ఇక్కడి నుంచి సాయంత్రం 5:30గంటలకు నంబరు 77696గా బయలుదేరి రాత్రి 10:10గంటలకు నంద్యాల చేరుతుంది. ఈ మార్పులు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. -
నమాజ్ వేళలు, ఆగస్టు 19, 2015
ఫజర్ : 4.45 జొహర్ : 12.20 అస్ : 4.47 మగ్రిబ్ : 6.40 ఇషా : 7.55 -
నమాజ్ వేళలు, శనివారం 4, 2015
ఫజర్ : 4.25 జొహర్ : 12.20 అస్ : 4.57 మగ్రిబ్ : 6.55 ఇషా : 8.16 -
నమాజ్ వేళలు, శుక్రవారం, మే 15, 2015
ఫజర్ : 4.26 జొహర్ : 12.12 అస్ : 4.42 మగ్రిబ్ : 6.41 ఇషా : 7.59