పలు రైళ్ల వేళల్లో మార్పులు | some trains timings changed | Sakshi
Sakshi News home page

పలు రైళ్ల వేళల్లో మార్పులు

Published Sun, Oct 2 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

some trains timings changed

కర్నూలు(రాజ్‌విహార్‌): దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న పలు రైళ్లు వేళల్లో మార్పులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు నుంచి సికింద్రాబాదుకు వరకు ప్రతి రోజు నడుస్తున్న హంద్రీ (ఇంటర్‌ సిటీ) ఎక్స్‌ప్రెస్‌ రైలు (నంబర్‌ 17223) సికింద్రాబాదులో ఇకపై సాయంత్రం 4:45కి బయలుదేరనుంది. కాచిగూడలో 5:10కి బయలుదేరి కర్నూలుకు రాత్రి 9:35 గంటలకు చేరనుంది. కాచిగూడా నుంచి చెన్నై వరకు నడిచే చెన్నై ఎగ్మోర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (నంబర్‌ 17652)ను తమిళనాడులోని తంబరం, చెంగల్‌పట్టు వరకు పొడగించారు. కర్నూలులో రాత్రి 8:08కి వచ్చి 8:10కి బయలుదేరే ఈ రైలు చెన్నైకు ఉదయం 7:25 గంటలకు, చెంగల్‌పట్టుకు ఉదయం 9:10 గంటలకు చేరుతుంది. అక్కడి నుంచి 17651 నంబరు రైలు  మధ్యాహ్నం 3:20గంటలకు, చెన్నై నుంచి 5గంటలకు కర్నూలుకు మరుసటి రోజు తెల్లవారుజామున 03:33గంటలకు చేరి 03:35గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడకు ఉదయం 7:55గంటలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి కర్నూలు వరకు నడుస్తున్న డెమో (నంబరు 77695) రైలు నంద్యాలలో ఉదయం 6:15 గంటలకు బయలుదేరి కర్నూలుకు 10:20 గంటలకు చేరుతుంది. ఇక్కడి నుంచి సాయంత్రం 5:30గంటలకు నంబరు 77696గా బయలుదేరి రాత్రి 10:10గంటలకు నంద్యాల చేరుతుంది. ఈ మార్పులు శనివారం నుంచే అమల్లోకి వచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement