రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు | trains timetable hasbeen changed | Sakshi
Sakshi News home page

రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు

Published Thu, Oct 1 2015 5:43 AM | Last Updated on Tue, Aug 28 2018 7:57 PM

రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు - Sakshi

రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు

సాక్షి, హైదరాబాద్ : పలు రైళ్ల వేళలు, స్టాపేజ్‌లు, వాటి నెంబర్లు, నడిచే రోజులు తదితరాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేసిన మార్పుల వివరాలను బుధవారం అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలతో కూడిన టైంటేబుల్ పుస్తకాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ ఎం.ఉమాశంకర్ కుమార్ తెలిపారు. దురంతో రైళ్లకు కొత్త స్టాపులను, 4 ఎక్స్‌ప్రెస్, 2 ప్యాసింజర్ రైళ్లను మరిన్ని స్టేషన్లకు పొడిగించగా మూడు రైళ్ల మార్గాన్ని మళ్లించారు. 30 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు. 12 రైళ్ల నెంబర్లను మార్చగా, 59 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు.

మళ్లింపు/పొడిగింపు..
మేడ్చల్-సికింద్రాబాద్ డెమూ ప్యాసింజర్ ఫలక్‌నుమా వరకు సికింద్రాబాద్‌తో సంబంధం లేకుండద మల్కాజ్‌గిరి, సీతాఫల్‌మండి మీదుగా ఫలక్‌నుమాకు చేరుకుంటుంది.

మహబూబ్‌నగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ మిర్జాపల్లి వరకు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా సీతాఫల్‌మండి, మల్కాజ్‌గిరి మీదుగా నడుస్తుంది.

తిరుపతి- హజ్రత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌తో సంబంధం లేకుండా కాచిగూడ మీదుగా ప్రయాణిస్తుంది.

దురంతో ైరె ళ్లకు కొత్త స్టాప్‌లు...
సికింద్రాబాద్-విశాఖపట్నం దురంతో ఎక్స్‌ప్రెస్ ఇకపై విజయవాడలో నుంచి విజయవాడలో ఆగుతుంది. సికింద్రాబాద్-ముంబై దురంతో పుణేలో ఆగుతుంది. యశ్వంత్‌పూర్-ఢిల్లీ సరాయి రోహిల్లా దురంతో గుంతకల్, సికింద్రాబాద్‌లో, హౌరా-యశ్వంత్‌పూర్ విజయవాడ, రేణిగుంటలో, చెన్నై-హజ్రత్ నిజాముద్దీన్ విజయవాడలో ఆగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement