అహోబిలేసుని సేవలో ఇంటలిజెన్స్ డీఎస్పీ
అహోబిలం (ఆళ్లగడ్డ): ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఇంటలిజెన్స్ డీఎస్పీ వంశీధర్‌గౌడ్ దర్శించుకున్నారు. ఆదివారం క్షేత్రానికి చేరుకున్న ఆయన ఎగువ, దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల్లో భాగంగా అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈయన వెంట ఐదుగురు ఇంటలిజెన్స్ ఎస్‌ఐలు ఉన్నారు.