న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. తైవాన్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో ఐదు పతకాలు కొల్లగొట్టారు. మహిళల 51 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పూజ స్వర్ణం సాధించింది. సోను 44 కేజీల విభాగంలో రజతం గెలవగా.. 59 కేజీల విభాగంలో మను కాంస్యం అందుకుంది.
పురుషుల విభాగంలో సతీశ్ 120 కేజీల గ్రీకోరోమన్ స్టయిల్‌లో రజతం సాధించగా.. 50 కేజీల విభాగంలో మనీశ్ కాంస్యం సాధించాడు.