
వసంతోత్సవం.. ఆనందోత్సాహం
ఆస్పరి: మండల పరిధిలోని బిణిగేరి ఆంజినేయ స్వామి, శంకరబండలింగమేశ్వర స్వామి ఉత్సవాల చివరిరోజు వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయా దేవాలయాల్లో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా గ్రామాల వారు రంగుల కడవలకు పూజలు చేసి ఆనందోత్సాహాల మధ్య రంగులు చల్లుకున్నారు. అనంతరం బిణిగేరిలో ఆంజినేయ స్వామి విగ్రహాన్ని , శంకరబండలో లింగమేశ్వర స్వామి పల్లకిని ఊరేగిస్తూ ఊరేగించారు. ఊరేగింపు సందర్భంగా కూడా రంగలు చల్లుకుంటూ సాగారు.
కల్లుబావి జట్టుదే విజయం..
శంకరబండ గ్రామంలో లింగమేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ఆదోని మండలం కల్లుబావి గ్రామానికి చెందిన జట్టు మొదటి స్థానంలో నిలిచింది. ఆస్పరి మండలం ముత్తుకూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. కలబావిజట్టుకు రూ.10,016 నగదును పురుషోత్తమరెడ్డి, ముత్తుకూరు జట్టుకు రూ. 5,016 నగదును లింగమయ్య స్వామి యూత్ అందజేశారు.