నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు.
మనోభావాలను దెబ్బతీసిన సీఎం
Jul 22 2017 11:23 PM | Updated on Aug 14 2018 11:26 AM
నంద్యాల: నంద్యాల పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. స్థానిక ఎస్పీజీ గ్రౌండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన బూటు కాళ్లతోనే టెంకాయలు కొట్టి, పూజలు చేశారు. అలాగే ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే బూట్లు విడవకపోవడంతో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు అఖిలప్రియ, కాలవ శ్రీనివాసులు, నారాయణ కూడా పాదరక్షలు తీయకుండానే కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Advertisement
Advertisement