వైభవోపేతం.. ఏకాదశి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిలంలో శుక్రవారం ఏకాదశి మహాత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఎగువ అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున విశ్వరూప సేవ, నిత్య పూజలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సహిత ప్రహ్లాదవరదస్వాములను ఆలయ ఆవరణలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకాలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులను పుల్లకిలో కొలువుంచి మాడా వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.