సంగమేశ్వరుడికి విశేషపూజలు | special puja in sangameswaram | Sakshi
Sakshi News home page

సంగమేశ్వరుడికి విశేషపూజలు

Published Mon, Sep 4 2017 11:25 PM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

సంగమేశ్వరుడికి విశేషపూజలు

సంగమేశ్వరుడికి విశేషపూజలు

కొత్తపల్లి: కృష్ణానది అంత్య పుష్కర పూజల్లో భాగంగా సోమవారం పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ  స్వామికి సహస్ర కలుశాభిషేకములు, పుష్కర స్నపనం, భీమలింగ పూజ, మెట్లోత్సవము తదితర విశేష చేపట్టారు. ఇందుకు సమీప గ్రామాల ప్రజలు తరలివచ్చారు. 5వ రోజున ధనిష్ట నక్షత్రము సప్తనదులలోని దశాశ్వమేధ తీర్థములో స్వామికి త్రిశూల కల్యాణోత్సవ పంచలోహ మూర్తులు, రథోత్సవ ఉత్సవ విగ్రహములకు పుష్కర స్నానము, సహస్ర కలశాభిషేకములను ప్రవాహ జలముతో అభిషేకించారు. అనంతరం భీమలింగ పూజ, రుద్రహోమము, పుష్కర బృహస్పతి యాగము, వరుణ, అరుణ, రుద్ర ఋష్యశృంగ పాశుపత జపములు, వరుణయాగము నిర్వహించారు. అనంతరం మూల వేపదారు శివలింగానికి రుద్రాభిషేకం, మహా మంగళ హారతితో పూజలు ముగించారు. కార్యక్రమంలో ఈఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement