వైభవంగా రథసప్తమి వేడుకలు
మహానంది: మహానంది క్షేత్రంలో రథసప్తమిని పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ డాక్టర్ శంకర వరప్రసాద్ ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలాచక్రవర్తి, తదితరులు విశేష పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనము, సూర్యయంత్రారాధన, ద్వాదశాదిత్యపూజ, రథాంగపూజ, రథాధిదేవతావాహనము పూజలు నిర్వహించారు. అనంతరం రథమును శివరాత్రిన జరిగే గంగా, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వారి కల్యాణోత్సవ ఉత్సవాలకు బయటకు తీశారు. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బాలరాజుయాదవ్, చింతకుంట్ల శివారెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, బండి శ్రీనివాసులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు నిచ్చెనమెట్ల శేషఫణి, గంగిశెట్టి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.