Manchu Manoj Shares His Wife Mounika Feet On Yoga Day Celebrations, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Manchu Manoj: భూమా మౌనిక అరుదైన ఫీట్.. ఫోటో షేర్ చేసిన మనోజ్!

Published Thu, Jun 22 2023 1:10 PM | Last Updated on Thu, Jun 22 2023 1:36 PM

Manchu Manoj Shares His Wife Mounika Feet On Yoga Day Celebrations - Sakshi

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కొద్ది నెలల క్రితమే భూమా మౌనికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఏడాదిలో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే బెంగళూరులో జరిగిన సుమలత కుమారుడి పెళ్లిలో ఈ జంట సందడి చేశారు. తాజాగా యోగా డే సందర్భంగా మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

(ఇది చదవండి: ‘ఆదిపురుష్‌’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?)

మనోజ్ వైఫ్ భూమా మౌనిక యోగా డే సందర్భంగా అరుదైన ఫీట్ సాధించింది. ఏకంగా 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. మై వైఫ్ భూమా మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

అంతకుముందే యోగా డే సందర్భంగా భూమా మౌనిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ఈ రోజు 108 సూర్యనమస్కారాలు పూర్తి చేసి.. యోగాపై నా ప్రేమకు అంకితం చేస్తున్నా. నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభానాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: రామ్‌ చరణ్‌.. ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి: మంత్రి రోజా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement