ఈ కలెక్టర్‌తో.. మేం వేగలేం
రాజీనామా ప్రకటించిన టీడీపీ ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు
పూతలపట్టు టీడీపీలో కలకలం
రంగంలోకి దిగిన జిల్లా టీడీపీ నాయకులు
తమ మాట కూడా వినడంలేదని వాపోరుున అగ్రనేతలు
పూతలపట్టు: ‘‘జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్ వైఖరి చూస్తుంటే మనం ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుంది. ఆయన ఇక్కడ ఉన్నంతకాలం మండల అభివృద్ధికి నిధులు రావు. టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారని’’ పూతలపట్టు మండల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వైఖరిని నిరసిస్తూ ఎంపీపీ వీణ తామంతా ముకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఉదయం మండలానికి చెందిన 7 మంది టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, 14 మంది సర్పంచులతో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి యువరాజుల నాయుడు, మురళీమోహన్, బాబూరావు, హిమగిరి నాయుడు, చంద్రమౌళిలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు ప్రొటోకాల్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజుల క్రితం ఎరచ్రెరువుపల్లెలో పీహెచ్సీ సబ్‌సెంటర్ ప్రారంభం, ఆదివారం పి.కొత్తకోట పీహెచ్సీ కొత్త భవనం నిర్మాణంలో సింగిల్‌విండో అధ్యక్షుడు కాంతారావు పేరు లేకపోవడంపై సంబంధిత అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని వారిపై చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తరుునా ఇప్పటి వరకు మండలానికి నిధులు మంజూరు చేయలేదన్నారు. గత 9 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ఇలాగైతే టీడీపీలో కొనసాగలేమని తెగేసి చెప్పారు. ఈ విషయమై సోమవారం టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ రావడంతో పార్టీ అధిష్టానం జిల్లా నాయకులను రంగంలోకి దింపింది. సోమవారం సాయంత్రం ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా నాయకులు చంద్రప్రకాష్, నాని, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిర మండలానికికు చేరుకోగా వారితో తెలుగు తమ్ముళ్లు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇప్పటి వరకు మండలానికి 14వ ఆర్థిక సంఘ నిధులు రాలేదని ఇలాగైతే గ్రామాల్లో అభివృద్ధి ఎలా చేయాలని ప్రశ్నించారు. తమ సొంత డబ్బులతో సీసీ రోడ్లు వేశామని వాటికి బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. దీనిపై నాయకులు స్పందిస్తూ కలెక్టర్ తమ మాట కూడా వినడం లేదనీ, రెండు రోజుల్లో సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేరుుస్తామని హామీ ఇచ్చారు.