
తిరుమల చేరుకున్న గవర్నర్
తిరుమల : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమల ఆలయ జేఈవో శ్రీనివాసరాజు గవర్నర్ నరసింహన్కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ రోజు ఆయన తిరుమలలో బస చేస్తారు. శుక్రవారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభం దర్శనంలో శ్రీవారిని నరసింహన్ దర్శించుకుంటారు.