దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి | MLA surrenders in case of attack | Sakshi
Sakshi News home page

దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

Published Thu, Dec 3 2015 12:57 PM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

MLA surrenders in case of attack

రేణిగుంట ఎయిర్‌పోర్టు అధికారిపై దాడి ఆరోపణల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని ఆందోళన నిర్వహించారు.


కాగా.. నవంబర్ 26న ఓ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టు అధికారితో ప్రోటో కాల్ విషయమై... ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ కేసులో చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు.., ఎంపీ మిధున్ రెడ్డి, మరో 15 మంది పై ఎయిర్ పోర్టు అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement