జగనన్నకు ఆత్మీయ స్వాగతం | Welcome to the spiritual ys jagan | Sakshi
Sakshi News home page

జగనన్నకు ఆత్మీయ స్వాగతం

Published Thu, Mar 24 2016 2:44 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

జగనన్నకు ఆత్మీయ స్వాగతం - Sakshi

జగనన్నకు ఆత్మీయ స్వాగతం

రేణిగుంట (ఏర్పేడు) : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయుకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయం వద్ద బుధవారం ఘనస్వాగతం లభించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న పార్టీ సమావేశానికి హాజరయ్యేం దుకు జగన్‌మోహన్ రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి, ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు బియ్య పు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం, అనుబంధ విభాగాలు, పార్టీ నాయకులు, అభిమాను లు, విద్యార్థులు స్వాగతం పలికారు.

పూలమాలు, శాలువలతో సన్మానించారు. అంతకు ముందు విమానాశ్రయంలో పార్టీ నాయకులతో ఆయ న కాస్సేపు మాట్లాడారు. విద్యార్థి విభాగం నిర్వహిస్తున్న మాక్ ఎంసెట్‌కు సంబంధించిన పోస్టర్‌ను జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. విమానాశ్రయం వెలుపల జననేత కరచాలనం కోసం అభిమానులు పోటీపడ్డారు. మార్గం మధ్యలో పలుచోట్ల వేచి ఉన్న యువకులు, మహిళలు, వృద్ధులను జగన్‌మోహన్ రెడ్డి పలకరించారు. స్వాగతం పలికిన వారిలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీ దేవి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చొక్కారెడ్డి జగదీశ్వర రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు, నాయకులు విరూపాక్షి జయచంద్రారెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, అంజూరు శ్రీనివాసులు, మిద్దెల హరి, బోయనపాటి మమత, బీరేంద్ర వర్మ, శ్రీకాంత్‌రాయల్ ఉన్నారు.

 
శ్రీకాళహస్తిలో..

శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీడ్స్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సవున్వయుకర్త బియ్యుపు వుధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయుకులు, కార్యకర్తలు ఘనంగా  స్వాగతం పలికారు. నియోజకవర్గంలో రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement