చిత్తూరు, రేణిగుంట:శ్రీలంక ప్రధాని రాణిల్ విక్రమె సింఘేకు గురువారం రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రెండు రోజుల తిరుమల పర్యటన నిమిత్తం ఆయన చెన్నై నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సతీమణి మైత్రి విక్రమె సింఘేతో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, లెఫ్టినెంట్ కల్నల్ అశోక్‌బాబు, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, తిరుపతి ఆర్‌డీఓ నరసింహులు, కోదండరామిరెడ్డి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ హెచ్.పుల్లా పుష్పగుచ్ఛాలను అం దించి స్వాగతం పలికారు. తర్వాత ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లో కాసేపు విశ్రాంతి తీసుకుని అధికారులతో ముచ్చటించారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమలకు బయల్దేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment