వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వరప్రసాద్, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ తదితరులు రేణిగుంటలో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి, నాయుడుపేట మీదుగా వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా కావలికి బయల్దేరి వెళ్లారు. నాయుడుపేటలో జరిగే అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం ప్రముఖ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు.