అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి | Spiritual touch to ys jagan | Sakshi
Sakshi News home page

అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి

Published Fri, Jan 22 2016 2:52 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి - Sakshi

అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి

రేణిగుంట/శ్రీకాళహస్తి: నెల్లూరుకు వెళ్లేందుకు రేణిగుంటకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనను కలసిన అభిమానులను ఆత్మీయంగా పలకరిస్తూ వెళ్లారు. నెల్లూరు జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్యయకర్త బియ్యపు మధుసూధనరెడ్డిలను పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి ఆయన గురువారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయన వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కూడా వచ్చారు. విమానాశ్రయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, మదనపల్లి, పూతలపట్టు, పీలేరు ఎమ్మెల్యేలు దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, చింతల రామచంద్రారెడ్డి, వైఎస్సార్ జిల్లా కోడూరు, రాయచోటి ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు కలివేటి సంజీవయ్య, పాశం సునీల్, అనిల్‌కుమార్ యూదవ్, నెల్లూరు జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి, కుప్పం, సత్యవేడు, చిత్తూరు నియోజకవర్గాల సవున్వయుకర్తలు చంద్రవళి, ఆదివుూలం, జంగాలపల్లి శ్రీనివాసులు, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేశారు. పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, పోకల అశోక్‌కువూర్, బీరేంద్రవర్మ, అంజూరు తారక శ్రీనివాసులు,ఎస్‌కేబాబు, విరూపాక్షి జయుచంద్రారెడ్డి, వువుతా చంద్రవళి, గువ్ముడి బాలకృష్ణయ్యు, మిద్దెల హరి, సిరాజ్‌బాషా, శ్రీకాంత్‌రాయుల్, ఎస్.కె.బాబు, ఎంవీఎస్ మణి, ముద్రనారాయణ, నగరం అవురనాధరెడ్డి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

జై జగన్ నినాదాలు
జగన్‌మోహన్ రెడ్డిని చూసేందుకు రేణిగుంట విమానాశ్రయం వద్దకు పెద్ద సంఖ్యలో  అభిమానులు తరలివచ్చారు. ఆయన వివూనాశ్రయుం వెలుపలకు రాగానే ‘జైజగన్’ అంటూ నినాదాలు చేశారు. వారందరికీ అభివాదం చేస్తూ  వుుందుకుసాగారు. మార్గమధ్యంలో పలుచోట్ల అభిమానులు కాన్వాయ్‌ని ఆపారు. వారందరినీ ఆయన ఆప్యాయంగా పలకరించారు.
 
అన్నా అరాచకాలు ఎక్కువయ్యాయి

‘అన్నా శ్రీకాళహస్తిలో టీడీపీ వాళ్ల అరాచకాలు అధికమయ్యాయి. అనవసరంగా వైఎస్‌ఆర్‌సీపీ వాళ్లపై కేసులు పెడుతున్నారు’ అంటూ స్థానిక పార్టీ నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు వెళ్తుండగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఏపీసీడ్స్ కూడలి వద్ద పెద్దఎత్తున పార్టీ శ్రేణులు, అభివూనులు జగన్మోహన్‌రెడ్డిని కలవడానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్‌యూదవ్, బీసీ సంఘం నేత వడ్లతాంగల్ చెంగల్రాయుల్‌రెడ్డి టీడీపీ ఆగడాలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ‘త్వరలో వుంచిరోజులు వస్తారుు. ఆందోళన చెందకండి’ అని జగన్ వారికి ధైర్యం చెప్పారు. తిరుగు ప్రయూణంలో ఆయన సాయుంకాలం 3.40 గంటలకు రేణిగుంట చేరుకుని విమానంలో హైదరాబాదుకు వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement