నేడు సీఎం రాక | CM visiting today | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రాక

Published Fri, Jun 19 2015 3:44 AM | Last Updated on Wed, Aug 29 2018 3:33 PM

నేడు సీఎం రాక - Sakshi

నేడు సీఎం రాక

చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ లో బయలుదేరి 11 గంటలకు పలమనేరు మండలం బొమ్మిరెడ్డిపల్లె పంచాయతీకి చేరుకుంటారు.

ఆ పంచాయతీ పరిధిలోని కనికెల్లలో  జరుగుతున్న నీరు - చెట్టు  కార్యక్రమం, పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్క డి నుంచి పలమనేరుకు చేరుకుని ప్రభుత్వ పాఠశాలలో బడిపిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొంటా రు. పిల్లలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం తిరుపతికి చేరుకుని మధ్యాహ్నం 3 గంటలకు ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement