
కలకలం రేపిన ఎయిర్ ఇండియా విమానం
తిరుపతి: రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం కలకలం రేపింది. కిందకు దిగే ముందు విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కిందకు దిగే ముందే మళ్లీ గాల్లోకి ఎగిరింది.
గాల్లో 20 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.