ఏపి పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అస్వస్థతకు లోనయ్యారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆయన అస్వస్థులయ్యారు. విఐపి లాంజ్లో ఆయనకు వైద్యసేవలు చేస్తున్నారు. ఆయనకు గుండెనొప్పి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి నారాయణ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి ఆయన ఒక యాగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ రేణిగుంట నుంచి విమానంలో హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో నారాయణ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విమానాన్ని వెనుకకు తీసుకువచ్చారు. రేణిగుంటలో విమానాశ్రయంలో మంత్రిని దించారు. అక్కడ వైద్యపరీక్షలు చేసి చికిత్స చేస్తున్నారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరారు.
Published Sun, Aug 24 2014 5:32 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement