
అప్పులు ఉండటం సహజం: సుజనా
తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం రేణుగుంట విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తనపై ఎలాంటి వ్యక్తిగత ఆరోపణలు లేవని సుజనా చౌదరి స్పష్టం చేశారు. అప్పులు ఉండటం సహజమే కదా అని తెలిపారు. మంత్రి పదవి చేపట్టిన మీరు బ్యాంకులకు బకాయిలు పడినట్లు మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయని వాటిపై మీ స్పందించాలని విలేకర్లు సుజనాచౌదరిని కోరారు. దాంతో సుజనాపై విధంగా స్పందించారు.
రేణిగుంట విమానాశ్రయంలో కేంద్రమంత్రి సుజనా చౌదరికి జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సుజనా చౌదరి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల బయలుదేరారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సుజనా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు.