
lరన్‌వేలో ఆగిపోయిన స్పైస్‌జెట్ విమానం
–హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన విమానం
–72 వుంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితం
రేణిగుంటః హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన విమానం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్‌లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్‌వేను దాటి అర కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.
నిర్ధేశిత రన్‌వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్‌పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు.
విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్‌లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.