
సాక్షి, తిరుపతి: ప్రేక్షకుల, అభిమానుల ఆదరణతోనే సినీ పరిశ్రమలో తమ కుటుంబమంతా రాణించగలుగుతోందని, ప్రేక్షకులే శ్రీరామరక్ష అని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. తిరుపతికి విచ్చేసిన ఆయనకు రేణిగుంట విమానాశ్రయంలో మంచు విష్ణు, మనోజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎం సునీల్ చక్రవర్తి శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గాయత్రి సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అభిమాని మాట్లాడుతూ.. గాయత్రి సినిమాలో తమ అభిమాన నటుడు అద్భుతంగా నటించాడని తెలిపారు. ఆయనకు శ్రీవారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.