
విమానాశ్రయంలో జగనోత్సాహం
రేణిగుంట: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విమానాశ్రయం జగనోత్సాహంతో నిండిపోయింది. నాయకులు, కార్యకర్తలు జై..జగన్.. జననేత జగనన్నకు జేజేలు అంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరులోని కేశవుల నగర్‌లో ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న రామిశెట్ట్డి లక్ష్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ట్రూ జెట్ విమానంలో వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి, రాజంపేట ఎంపీలు వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జిల్లా కన్వీనర్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సంజీవయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల కన్వీనర్లు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డి, లోకేష్ యాదవ్, రేణిగుంట మండల కన్వీనర్ హరిప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ నాయకులు జువ్వల దయాకర్‌రెడ్డి, గురవరాజపల్లె శంకర్‌రెడ్డి, మోహన్ నాయుడు నగరం భాస్కర్ బాబు, బాల సుబ్రమణ్యం, సుజాత, స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువకులు జగన్ ఫ్లెక్సీలతో వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ అభివాదం చేశారు. అనంతరం రోడ్డు మార్గాన నెల్లూరుకు బయలుదేరి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం విమానాశ్రయం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఆ పార్టీ నాయకులు వీడ్కోలు పలికారు.