
విమానాశ్రయంలో జగన్‌కు వీడ్కోలు
రేణిగుంట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి గురువారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వీడ్కోలు పలికారు. పొట్టి శ్రీరాములు నెల్లూ రు జిల్లా పర్యటన ముగించుకున్న ఆయన తిరుగు ప్రయాణంలో రేణిగుంట చేరుకున్నా రు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలివేటి సంజీవయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నాయకులు పాల గిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే బాబు, వెంకటేశ్వర్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత, విరూపాక్షి జయచంద్రారెడ్డి, అత్తూరు హరిప్రసాద్‌రెడ్డి, యోగీశ్వర్‌రెడ్డి, జువ్వల దయాకర్‌రెడ్డి, కన్నలి మోహన్‌రెడ్డి, బాల, శ్రీకాంత్, సిరాజ్‌బాషా, పేరూరు పురుషోత్తంరెడ్డి, నగేష్, రాజేంద్ర వీడ్కోలు పలికారు. అనంతరం ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ వెళ్లారు.