తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..! | Spicejet Aircraft Emergency Landing At Renigunta Airport In Tirupati | Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం; విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..!

Published Wed, Jul 17 2019 10:20 AM | Last Updated on Wed, Jul 17 2019 10:52 AM

Spicejet Aircraft Emergency Landing At Renigunta Airport In Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి : ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో స్పైస్‌జెట్‌ విమానం అత్యవరసంగా ల్యాండ్‌ అయింది. పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్లు సాంకేతిక సమస్యను గుర్తించి వెంటనే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఉన్నట్టు సమాచారం. దీంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి స్పైస్ జెట్ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. ట్రాక్టర్ సహాయంతో విమానాన్ని రన్‌వే నుంచి పక్కకు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement