నాంపల్లి: ఏసీ గార్డ్స్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (ఐటీ టవర్స్)కు సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఐటీ టవర్స్‌ను కాసేపట్లో పేల్చేస్తామంటూ ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు డయల్ 100కు ఫోన్ కాల్ వచ్చింది. మెయిన్ కంట్రోల్ విభాగం సిబ్బంది వెంటనే నాంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. అనంతరం ఐటీ టవర్స్‌ను పూర్తిగా బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. టవర్స్‌లోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఎక్కడా బాంబు లేదని, ఫోన్ కాల్ ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment