
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టింది.
వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి బాంబ్ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. జీఎంఆర్ కస్టమర్ కేర్‌కు ఈ మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తోంది.
మరోవైపు.. బెదిరింపు మెసేజ్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, సదరు మెసేజ్ విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment